|
|
|
 |
| |
తెలుగు వెబ్ సైట్ ను 25-12-2007 న నెల్లూలోని అచ్యుత సుబ్రహ్మణ్యం కళ్యాణ మండపంలో సాయకాలం 6 గంటలకు ప్రారంభిస్తున్నాం. ఈ సభను వీణాపాణి విద్యాసమితి వారి అనుబంధ సంస్థ అయిన చంద్రశ్రీ ఆడియోస్ అండ్ వీడియోస్ సంస్థ ఆద్వర్యవంలో జరుగుతుందని ఈ సంస్థల ప్రారంభకులు, నిర్వహకులు అయిన డాక్టర్ అమృత వాక్కుల శేషకుమార్ గారు తెలిపారు.
ఈసందర్భంగా ఉదయం పూట మహారుద్ర యాగం, చండీ హోమాలు నిర్వహిస్తున్నారు. ఈ హోమాల తరువాత 1 గంటకు హోమ ప్రసాద రూపంగా భోజనాలను ఏర్పాటు చేశారు.
సాయంకాలం సభలో విజయవాడ ఆకాశవాణి ప్రభందకులు శ్రీ శ్రీ మంగళగిరి ఆదిత్య ప్రసాదుగారు ఆకాశవాణికి చేసిన సేవలను గుర్తించి వారిని "ఆకాశవాణీ ప్రభాకర" అనే బిరుదునామంతో సత్కరిస్తున్నారు. నెల్లూరు నగరంలో ప్రసిద్ధులైన మాచవోలు రమేశ శర్మగారిని "పురోహిత భాస్కర" అనీ బిరుదునామంతో సన్మానిస్తున్నారు అని ఆయన చెప్పారు.
ఈ సందర్భంగా వేద సమ్స్కృత కళాశాల లో చదువుతూ సంస్కృత వ్యాకరణశాస్త్రంలో బి ఏ లోను ప్రీడిగ్రీ లోనూ అత్యుత్తమ మైన మార్కులు సంపాదించుకొన్న విద్యార్థులకు "అమృతవాక్కుల అవార్డు" పేర రూ- 500/ మరియు రూ- 300/, మొమెన్టో ప్రశంసా పత్రాలనిచ్చి ఉత్సాహ పరుస్తున్నారని అమృతవాక్కుల తెలిపారు.
ఇదే కార్యక్రమంలో డా అమృత వాక్కుల శేషకుమార్ రచించిన శ్రీమద్వచన భగవద్గీతా గ్రంథాన్ని ఆవిష్కరిస్తున్నారు.
ఇంకా వారే దూరదర్శన్ సప్తగిరివారిచే ప్రసారం చేయబడిన తిరుమల, తిరుచానూరు, శ్రీనివాసమంగాపురం బ్రహ్మోత్సవాలకు, తిరుమల రథ సప్తమికి, నెల్లూరు రంగనాయక స్వామి వారిబ్రహ్మోత్సవాలకు వ్రాసి ఇచ్చి గాత్రాన్ని అందించిన యవనికాంతర భాషణల పూర్తి పాఠాన్ని ఆడియో సీ డీ లుగా లోకార్పణం చేస్తునారు.
కార్యక్రమాలను డా సతీష్ మరియు గాయత్రీ సేవా సమాజం సభ్యులు పర్య వేక్షిస్తున్నరని వారు తెలిపారు.
ఈ సభాకార్య క్రమానికి ముందుగా జమ్మలమడక బాలార్క గారు వారి బృందంతో సంగీత విభావరి కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
ఈసంస్థ వారు ఆహ్వానించిన ముఖ్య అతితులు.
సభాధ్యక్షులు-
"సాహిత్య రత్న" శ్రీ అమృతవాక్కుల సత్యనారాయణగారు ఎం.ఏ .,బి ఇ డి.
అధ్యక్షులు, వీణాపాణి విద్యాసమితి, మరియు అనుబంధ సంస్థలు.
ముఖ్య అతిథులు
రాజా సురానేని వెంకట సుధాకరరవు బహద్దర్ జమీందారు గారు
ద్వారకాతిరుమల దేవస్థాన వంశపారంపర్య పాలక మండలి అధ్యక్షులు
మైలవరం.కృష్ణా జిల్లా. ఆంధ్ర ప్రదేశ్.
1.శ్రీ గుల్బర్గా శర్మ గారు
2.శ్రీమాన్ రామాయణం శ్రీనివాసన్
కంచికామకోటి పీథాధిపతుల ప్రతినిధులు
కాంచీ పురం. తమిలనాడు.
శ్రీ రామకుమార్ గారు. ఏ.
డైరెక్టర్ ఆమ్బిట్ ఐ ఎన్ సి., శాన్త మోనిక, కాలిఫోర్నియా. అమెరిక.
శ్రీ ఎన్. చన్ద్ర శేఖరన్.
ఇండియన్ తెలుగు అస్సోసియేషన్. చెన్నై.
డా. పమిడికల్వ చెంచుసుబ్బయ్య గారు
కో ఆర్డినేటర్. వేటూరి ప్రభాకరశాస్త్రి వాఙ్మయ పీథం
తిరుమలతిరుపతి దేవస్తానములు . తిరుపతి.
శ్రీ మంగళగిరి ఆదిత్య ప్రసాదుగారు
డైరెక్టర్. ఆకాశవాణి కేంద్రము. విజయవాడ.
బ్రహ్మశ్రీ మాచవోలు రమేశ శర్మగారు
నెల్లూరు.
ఈ కార్యక్రమాలకు అందరూ ఆహ్వానితులే.
ఇట్లు
సరస్వతీ పుత్ర.సాహిత్య కళాభిఈఙ్ఞ, సాహిత్య మహోపాధ్యాయ, సభావాచస్పతి, సాహిత్య వారిధి
డా. అమృత వాక్కుల శేషకుమార్. ఎం.ఏ., ఎం.ఏ.,ఎం.ఏ., ఎం.ఏ., పి హెచ్. డి.
తమ్మెర శ్రీ వాణి ఎం సీ ఏ. టి వి ఆర్ సతీష్ ఎం ఎస్ సీ పి హెచ్ డీ, చెన్నై
మరియు
గుమ్మా శ్రీ శైల ఎం ఏ , జి ఆర్.జి. కే. శాస్త్రి ఎం బి ఏ. యూ ఎస్ ఏ.
"అమృతవక్కుల.కాం" వెబ్ సైట్, తే 25-12-2007 న ఆరంభింపబడింది. నెల్లూరులో ఆరంభింపబడిన ఈ సైట్ ఇప్పుడు పూర్తి స్థాయిలో ఉండడాన్ని చూసిన పత్రికా ప్రతినిధులు, మీడియా వారు పుర ప్రజలు, అతిథులు కూడ చాలా ఆనందాన్ని అనుభవిస్తు "అమృతవాక్కుల.కామ్" తెలుగువారి గౌరవాన్ని మరింత పెంచేదిగాను, చరిత్ర,సాహిత్యం, సంసృతి, ఆచార వ్యవహారళూ, దేవాలయాల చరిత్ర, మతాల విశేషాలు,బాలసాహిత్యం, వార్తలు , ఫొటో గాలరి, ఆడియో విడియోలు ఆధ్యాత్మికతను పెంచే రీతిలోను సంస్క్రృతిని తెలియచేసేవిగానూ ఉండి చాలా ఉపయోగకరంగా ఉయందని ప్రశంసించారు. వీణపాణీ విద్యాసమితి సన్మానించడమే కాకుండా పౌరులు కూడా సన్మాన గ్రహీతలను సన్మనించడం వెబ్ సైట్ మీద ఉన్న అందరి గౌరవాన్ని చాటిచెప్పిందని అన్నారు. ఆకాశవాణీ విజయవాడ స్టేషను డైరెక్టరు మంగళగిరి ఆదిత్య ప్రసాదుగారిని "ఆకాశవాణి ప్రభాకర" అని మాచవోలు రమేశ శర్మగారిని "పురోహిత భాస్కర" అని బిరుదిలతో సతకరించడమ్ జరిగింది.
ఈ సందర్భంగా ఆర్గనైజర్స్ గా పని చేసిన తమ్మెర సతీశ్ గారిని వెబ్సైట్ స్పాన్సర్ చేసి అప్ లోడ్ చేసిన రమేశ్ గారిని, వెబ్ సైటె సృష్టి కర్త, రచయిత, ఆధ్యాత్మిక ప్రవక్త, ఆస్క్ భారత్ గురు భాగంలో "హర్సమయ్.కామ్ లో ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్న డాక్టర్ అమృత వాక్కుల శేషకుమార్ గారిని పౌరులు పలుమంది అభినందిస్తూ సన్మానించారు.
తెలుగు వారు ఎక్కడి వారైనా తెలుగు కవితలుగాని లఘు కథానికలు గాని పంపితే వాటిని ఈ తెలుగు వెబ్ సైటెలో ఉంచడానికి సిద్ధంగా ఉన్నమని చెప్పారు. ఈ వెబ్ సైట్ ను ఓపెన్ చెసేవారు తెలుగు ఫాంటును వేరుగా డౌన్ లోడ్ చేసుకోనక్కరలేదని తెలుసుకొనిన శ్రోతలు చాలా సంతోషించారు.
ఈసభను కార్యదర్శి తమ్మెర శ్రీవాణీ నిర్వహించి తమ కార్య దర్శి నివేదికను చదివి వినిపించారు.అధ్యక్షులుగా శ్రీ పి. చెంచు సుబ్బయ్యగారు శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి వాఙ్మయ పీఠం డైరెక్టర్ తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి వారు వ్యవహరించారు. కంచికామకోటి పీఠం స్వామివారు శ్రీ శ్రీ శ్రీ విజయేంద్ర సరస్వతీ శంకరాచార్యస్వామివారు ప్రతినిధులను పంపించి సభాకార్య స్రష్ట అమృత వాక్కులను సన్మానించి ఆశీర్వదించారు.
అమృతవాక్కుల.కామ్ వెబ్ సైట్ ను ఆదిత్య ప్రసాద్ గారు ప్రారమ్భించారు. శ్రీమద్వచన భగవద్గీత గ్రంథాన్ని రామాయణం శ్రీనివాసన్ కాంచీ పురమ్ వారు ఆవిష్కరించారు. అమృతవాక్కుల వ్రాసిన శ్రీమద్వచన భగవద్గీత గ్రంథాన్ని చెన్నై నుండి వచ్చిన చన్ద్ర శేఖరన్ విడుదల చేశారు.
ఈ కార్యక్రమానికి చివరలో సంస్కృతవ్యాకరణ శాస్త్రంలో ఎక్కువ మార్కులు వచ్చిన వేదసంస్కృత కళాశాల విద్యార్తులకు వీణాపోఅణి విద్యాసమితి నగదుబహుమతినిచ్చి సత్కరించింది. వందన సమర్పణ చేస్తూ అమృతవాక్కుల తిరిగి మళ్ళీ డెసెంబరు లోపులో హిందీ లో కూడా ఇదే విధమైన సైట్ ను ప్రారంభిస్తామని చెప్పి మరొక విశేష కార్యక్రమంలో మనం అందరం కలుసుకొందామని ముగించారు.
సభానంతరమ్ భోజనకార్యక్రమంతో ఆనాటి వీణాపాణి విద్యాసమితి విశేషోత్సవాలు ముగిశాయి.
వార్తలు 3 తా. 14-1-2008
అమృత వాక్కుల.కామ్ ప్రాన్తీయ కార్యాలయం( నెల్లూరు మూలపేట.ఆంధ్ర ప్రదేశ్ ఇండియ) లో వీణా పాణి విద్యాసమితి ఆధ్వర్యవంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని భోగి రోజున విశేష కార్యక్రమం నిర్వహించారు. సాయంకాలం 7 గంటలకు ఆరంభించి శ్రీ మహా విష్ణు సహస్రనామార్చన, శ్రీ లలితాసహస్రనామార్చనలతో పాటు స్తోత్ర పారాయణలు కూడా చేశారు. ఈ ఫలితాన్ని అమృత వాక్కుల.కాం సృష్టి కర్త్రీ శ్రీమతి అమృతవాక్కుల చంద్రకల ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆమె ఆత్మకు శాంతి కలుగుగాక అని అందరూ భగవంతుడైన శ్రీమహా విష్ణువును, పరమేశ్వరి అయిన లలితా దేవిని ప్రార్తించారు. కార్యక్రమంలో గాయత్రీ సేవా సమాజం సభ్యులు అధికసంక్యలో పాల్గొన్నారు. కార్యక్రమానంతరం వచ్చిన స్త్రీలందరికీ తాంబూలం జాకెట్టు గుడ్డలనూ పండ్లనూ ఇచ్చి శ్ర్రీమతి శ్రీవాణీ సతీష్ లు సత్కరించారు. కార్యక్రమంలో ఏ.వి సత్యనారాయణ ద్వారకాతిరుమల వారు, జొన్నలగడ్డ కృష్ణయ్యగారు, చిన్మయామిషన్ సెక్రెటరీ అధ్యక్షులు అయిన సుబ్బారావు, మధుసూదన రావుగారు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ అమృతవాక్కుల శేషకుమార్ ఈ వెబ్సైటునిర్వాహకులు ఈకార్యక్రమాన్ని నిర్వహింపచేశారు. సంక్రాంతి శ్రీమన్నారాయణుని మకరసంక్రమణ ప్రర్వ దినాన్ని పురస్కరించుకొని ప్రార్థించడం ఉన్నతమని ఆయన అన్నారు.
ఈ సందర్భంగా హర్ సమయ్.కం లో ఫొరమ్ భాగంలో అస్క్ భారత్ గురులో ఆధ్యాత్మిక సాహిత్య సాంస్కృతిక విషయాలపై ఉన్న ప్రశ్న జవాబులను చూడమని అందరినీ కోరారు.

తేది.14.6.2008 నెల్లూరు
అమృతవాక్కుల శేషకుమార్ గారి ఆధ్వర్యవంలో నెల్లూరులోని మూలపేటలో ఉన్న శ్రీ వేణుగోపాలస్వామివారి దేవస్థానం కళ్యాణమంటపాలలో సామూహికసత్యనారాయణ వ్రతాలు 14.6.2008 నాడు జరిగాయి . ఈ కార్యక్రమంలో 150మేది పాల్గొనడానికి ఉత్సాహం చూపారు. ఐతే 100 మంది మాత్రమే హాజరయి ఈ వ్రతాలు చేసుకొన్నారు ప్రతి ఒక్కరికి కుట్టుడాకు మంటపారాధన వస్త్రం వీరవేంకటసత్యనారాయణస్వామివారి వెండి రూపు అన్నవరం నుంజి తెప్పించి ఇచ్చారు. అన్నవరం నుండి వచ్చిన శ్రీ కే సత్యనారాయణగారు వ్రతం కార్యక్రమాన్ని నిర్వహించారు. సత్య నారాయణస్వామి వారి ప్రసాదాన్ని అమృతవాక్కులచంద్రకళ గారి పేర డా అమృకతవాక్కుల శేషకుమార్ గారు పంచిపెట్టారు. పిశుపాటి ఆంజనేయశర్మగారు పురుషులకు పైపంచెలు పంచిపెట్టారు. వారి అల్లుడు నరసింహమూర్తిగారు భార్య ఆడవారికి జాకెట్టుగుడ్డలు పంచిపెట్టారు. 400 మంది భోజనాలు చేసి అందరూ కార్యక్రమం చాలా బాగా జరిగిందని ప్రశంశించారు.

| >
| >
|
|