|
|
|
  | |
| |

| ॐ भूर्भुवस्स्वः
तत्सवितुर्वरेण्यम् ।
भर्गो देवस्य धीमहि
धियो यो नः प्रचोदयत् ॥ |

| वेङ्कटाद्रि समं स्थानम्
ब्रह्माण्डे नास्ति किञ्चन
वेङ्कटेश समोदेवो
न भूतो न भविष्यतì |

| द्वारकाद्रि निवासाय
दिव्य सूर्यर्चिताय च ।
अलर्मेल्मङ्गनाथाय
वेङ्कटेशाय मङ्गळम् ॥ |

| श्रीरामचंद्रः श्रितपारिजतः
समस्त कळ्याण गुणाभिरामः ।
सीता मुखाम्भोरुह चञ्चरीकः
निर्न्तरं मङ्गळमातनोतु॥ |
1.ఇష్టదేవతా ప్రార్థన
2.ఉపోద్ఘాతం
3.తెలుగు భాష
4.మావూరు
5.మా ముత్తాతగారు
6.మా తాతగారు
7.శ్రీ వేంకటనరసింహమూర్తిగారిసంతానం
8.వెంకట సత్యనారాయణగారు.
back to top
1.ఇష్టదేవతా ప్రార్థన
ఓం గాయత్రీదెవ్యై నమః
ఓం భూర్భువస్సువః
తత్సవితుర్వరేణ్యం|
భర్గొదేవస్య ధీమహి
ధియో యో నః ప్రచోదయాత్||
ఓం వేఙ్కటేశాయ నమః
వేఙ్కటాద్రి సమం స్థానం
బ్రహ్మణ్డే నాస్తి కిఞ్చన |
వేఙ్కటేశ సమోదేవోనభూతో న భవిష్యతి ||
ద్వారకాద్రినివాసాయ
దివ్యసూర్యర్చితాయ చ |
అలర్మేల్మఙ్గనాథాయ
వేఙ్కటేశాయ మఙ్గళమ్ ||
శ్రీరామచన్ద్రాయనమః
శ్రీరామచన్ద్రః శ్రితపారిజాతః
సమాస్తకళాణగుణాభిరామః |
సీతాముఖామ్భోరుహచఞ్చరీకః
నిరన్తరం మఙ్గళమాతనోతు ||
2.ఉపోద్ఘాతం
శ్లో కం||
ఆపి స్వర్ణమయీ లంకా న మే రోచతి లక్ష్మణ|
జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసీ||
ఆని భారతీయ ఆది కవి అయిన వాల్మీకి మహర్షి రాముడు నాయకుడుగా ఉన్న శ్రీమద్రామాయణంలో రాముని నోటివెంట లక్ష్మణునితో అనిపిస్తాడు.
రావణాసుర సంహారం తరువాత విభీషణపట్టాభిషేకం జరిగింది. ఆ సమయంలో లక్ష్మణుడు చూసిన లంకానగరాన్ని గురించి రామునితో చెబుతూ లంకానగరాన్ని వర్ణిస్తాడు. అది విన్న రాముడు "లక్ష్మణా| బంగారంతో నిండినదైనా సరే లంకా నగరం నాకు నచ్చదు. తల్లి, మాతృ భూమి స్వర్గం కంటే గొప్పవి కదా" అంటాడు.
అలాగే మన భారత దేశం చాలా ప్రేమించ తగినది.ఎక్కడ ఉన్నా ఏ దేశానికి వెళ్ళినా మతృ దేశాన్ని మరువకూడదు.
భారత దేశం చాల ప్రాచీన దేశం. సూర్య వంశం చన్ద్రవంశంలో పుట్టిన రాజులు భారత దేశాన్ని పరిపాలించేవారు.కాశీరాజు వంశం వారు ఇప్పటికీ కాశిలో ఉన్నారు. ఈ దేశంలో ధర్మం నాల్గు పాదాలతో నడిచే సాధుజన్తువు ఆవులాగ ఉండేది. మునులు ఋషులూ చెప్పినట్లు నడిచేవారు.రాజ్యంలో ప్రజలు సుఖంగా కాలం గడిపేవారు. ఇది పుణ్య భూమి కర్మభూమి. ఇలాన్టి భూమిలో పుట్టినందుకు చాలమంది ఈ సంస్కృతిలో ఉన్నందుకూ సంతోషిస్తూ ఉంటారు.
అలాన్టి భారత దేశానికి అన్నపూర్ణ వంటిది "ఆంధ్రదేశం". దీన్నే "ఆంధ్రప్రదేశ్" అనీ తెలుగు దేశం అనీ పిలుస్తారు. ఈ రాష్టంలో వ్యవసాయం ముఖ్య వృత్తి.వ్యవసాయ కూలీలు నిత్యం పల్లెపదాలు పాడుతూ వరినాట్లు వేస్తూ ఉంటారు.పొగాకు,మిరపకాయలు,చెఱకు,ప్రత్తి,వంటి చాలా పంటలు ఉన్నప్పటికీ బియ్యం వచ్చేధాన్యపు పంటనే అధికంగా పండిస్తూ ఉంటారు.
పచ్చని పైర్లతో నిండిన ఆంధ్రదేశం చూడడానికిచాలా అందంగా ఉంటుంది.అనుభవ యోగ్యంగానూ ఆహ్లాదకంగానూ ఉంటుంది .
ఉదయమే కోడిపుంజులు కొక్కొరో కో అని కూస్తూ ఉంటేనూ,కోకిల పాటలతోనూ,పిట్టలరుపులతో,ఆవుల అంభారావాలతో,సూర్యోదయం అవుతూఉంటె ఆంధ్రదేశంలోనిద్ర లేచేవారు ఈ అన్నపూర్ణ వంపుసొంపుల్ని గమనించగలరు.అంతేగానిప్రొద్దుపొడిచాకా లేచేవారు ఈ తెలుగు సొయగాలు చూడలేరు.
పల్లె పడచులు నిత్యం పాలు పెరుగులు పల్లెటూళ్ళ నుండి పట్టణాలకు నెట్టిమీద బుట్టలలో మోసుకొని వెడుతూ ఉంటారు.
దేవాలయాల్లో సూర్యోదయం అవుతున్నప్పుడు సుప్రభాతం పాడబడుతూ ఉండబడుతూ ఉంటుంది. బాలభోగం అనే ఆరగింపు చేసి, వైష్ణవాలయాల్లో పెరుగుతో కలిపిన అన్నంలొ పోపు పెట్టిన "దధ్యోదనమ్" అనే ప్రసదాన్ని పంచి పెడతారు . భక్తులు ఎంతో శ్రద్దా భక్తులతొ ఈ ప్రసదాన్ని తీసుకోవడానికి దేవాలయాలకు వెళ్ళి దైవదర్శనమ్ చేసుకొని ఇళ్ళకు తిరిగి వచ్చి నిత్యకర్మలలో పాల్గొంటారు.
శివాలయాల్లో పూజలకు ముందుగా గణపతిని విష్ణుమూర్తి ఆలయాల్లో విష్వక్సేనులవారినీ పూజిస్తారు వీరినిద్దరినీ ముందుగా పూజిస్తే ఏ కార్యం చేసినా ఆటంకాలు లేకుండా పూర్తి అవుతాయని నమ్ముతారు నిజం కూడా అంతే, అందుకే శివుని కళ్యాణానికి ముందు కూడా విఘ్నేశ్వరుని తప్పక పూజిస్తారు.
ఉదయమే కంచులోహంతో తయారు చేసిన గంటల మోతలు వింటే చెవులకు ఎంతో ఆనందం కలుగుతుంది. నిద్ర లేవగానే ఇలాంటి శుభప్రదమైన శబ్దాలు వినడం వలన ఆ రోజు అంతా శుభంగా గడుస్తుంది .
ఆంధ్ర దేశంలొ శివాలయం గాని విష్ణు మూర్తి ఆలయం గాని లేక రామ కృష్ణ దేవాలయాలో ఏదైన ఒకటి గాని ఉండకుండా ఉండదు.ఇది ఆంధ్ర దేశపు ఆచరాం. ప్రతి పల్లెటూళ్ళోనూ గ్రామ దేవత ఆలయం తప్పక ఉంటుంది.
కనుక ప్రతి ఒక్కరూ నిద్ర లేవగానే మంచి మఙ్గళశబ్దాలనే వింటారు, భావిస్తారు. ఈది "సర్వే జనాః సుఖినో భవన్తు" అనే వాక్యానికి అర్థాన్ని స్పష్టం చేస్తుంది.
ఇది కేవలం తెలుగు నేలకు సంబంధించిన ఆచారమే కాక యవద్భారదేశంలోనూ సాగుతూ వస్తున్న అలవాటు.
back to top
3.తెలుగు భాష
తే.గీ.
వెలుగు విరజిమ్ము మనముల తెలుగు భాష
జిలుగుబెళుకుల నిండుగ చిలకరించు |
శుకపికాలాపనముల,పలుకుల సొంపు
పెంపులెన్నియొ కల్గిన ప్రియపు బాస ||
తే.గీ.
గీతవాద్యాల సౌమ్యపు కీరవాణి
వేద నాదాల పూతయౌ విజ్ఞ వాణి |
పేద సాదలజీవిత పిలుపు వాణి
నాదు సుందర తెలుగు నాట్యరాణి ||
తే.గీ.
దైవ వాసమై వెలుగొందు దివ్య భూమి
తిరుమలేశుని విభవపు తెలుగు భూమి |
భక్తి పరవశత పరవళ్ళు పారు భూమి
రామదాసుని భద్రాద్రి రమ్య భూమి ||
తే.గీ.
కవిజనులు తిరుగాడిన కమ్రభూమి
నన్నపార్యుని కవనంపు నాణ్య భూమి|
సోమయాజుల నిలయంపు సౌమ్యభుమి
తిక్కనార్యుని భారతి తెలుగు భుమి||
రచన: డా||అమృతవాక్కుల శేషకుమార్, నెల్లూరు
back to top
4.మావూరు
మావూరు అనేది చాలా
ఇష్టమైనదిగా ఉంటుంది.
అలాగే మాఊరు కూడా మాకు ఎంతో ఇష్టమైనది అవడంలో ఆశ్చర్యం
లేదు.ఇప్పటికి తెలుసున్నంతవరకూ మొదట్లో ఉన్న మా గురించి చెప్పాలంటే మా ప్రాచీనులు
వరంగల్లు దగ్గర హనుమకొండలో ఉండే వారు. కనుకనే మావశం హనుమకొండ నాడీ అని అంటారు.
దాదాపు 17 వ శతాబ్దానికే మా ఇంటి పేరు అమృత వాక్కుల ఉన్నట్లుగా మా వంశ వృక్షం
దొరికింది. ఆ నాటికి మా వంశస్థులు తమ వేదం అయిన శుక్ల యజుర్వేదాన్ని పూర్తిగా
చదువుకొని, అందులో మహాపండితులయి, యాగాది ప్రయోగ విజ్ఞానాన్ని కూడా క్షుణ్ణంగా కలిగి
ఆనాటి రాజులచేత మన్ననలను అందుకొని ఉండేవారని మా పెద్దలు చెప్పే వారు.
మా స్వాధ్యాయ వేదం-యాఙ్ఞవల్క్య మహాముని ప్రొక్త శుక్లయజుర్వేదం.
యాఙ్ఞ వల్క్య మహాముని చిన్నతనంలో విద్యాభ్యాస సమయంలోనే తన గురువుగారికి కలిగిన
బ్రహ్మ హత్యా దోషాన్ని పోగొడతానని చెప్పడంతో గురువుగారు ఆతడు చిన్నపిల్లవాడయి, తనకు
తెలియని విద్యలను కూడ ప్రదర్శించగలననే అహంభావంతో ఉన్నాడని కోపగించారు గురువుగారు.
నీకింత అహంకారమా నామీదనే నీవు ప్రయోగం చేయ యత్నిస్తున్నావా? అని
ఆగ్రహించారు. నీవు తెలివైనవాడవని కదా నీ గర్వం . అందుకే నా దగ్గర చదివిన చదువులన్నీ
వెంటనే కక్కు అని ఆఙ్ఞాపించారు. దానితో చేసేది లేక ఆత్మ విశ్వాసి అయిన యాఙ్ఞ్వల్క్య
బాలుడు వెంటనే గురువుగారు చెప్పిన వేద విద్య నంతటినీ అక్కడికక్కడ కక్కేశాడు. దాన్ని
మిగిలిన విద్యార్థులందరూ తిత్తిరి పక్షులయి భుజించారుట. వారి ఙ్ఞానంతో లోకంలో
ప్రవర్తింప చేసిన వేదమే తైత్తిరీయ సంహితగా కృష్ణ యజుర్వేదం అనే పేర ఇప్పటికీ
ప్రయోగంలో ఉంది. తన వేద విఙ్ఞానం అంతా నష్టంఅయి
పోయింది.యఙ్ఞవల్క్యుడు నిర్వేదుడయ్యాడు.ఇప్పటికీ "నిర్వేద" శబ్దం బాధగా
ఉన్న వానికి ఉన్న బాధను చెప్పడానికి చెపుతున్నాం.తన పఠితాంశం అయిన వేదం అంతా
నశిమ్చిపోతే నిర్వేదమే కదా మిగులుతుంది. లొకానికి కొత్త వేదాని
అందించాలనే భావంతో సుర్య భగవానుడి కోసం తపస్సు చేశాడు.సూర్య భగవానుడు ప్రత్యక్షమయి
నీకు కొత్త వేదం చెప్పడం పెద్ద కష్టం కాదు.కాని నా గమనానికి తగిన వేగంతో నీవు నా
వెనకాలే వస్తూ చదువుకోగలవా? అని ప్రశ్నించాడు. యఙ్ఞవల్క్య బాలుడు
రవి గమనంతో సమానంగా పయనిస్తూ తాను విద్య నేర్చుకుంటానని మాట ఇచ్చాడు. గురువు
సాక్షాత్తు సూర్య నారాయణ మూర్తీ. శిష్యుడు భావి వాజసనేయ సంహితా వ్యాపనాభ్యసన
ధురీణుడు. పాఠం సాగిపోతోంది. ఋగ్యజుస్సామలపేర ఉన్న వేదాలకంటే భిన్నమై లోకోపకార
భూయిష్టమై, స్వచ్ఛమై , ఉండే నూతన వేదావిర్బావానికి ఈ ప్రయతం. సజావుగా 40 పన్నాల
శుక్ల యజుర్వేదాన్ని, యఙ్ఞవల్క్య మహాపురుషుని మస్తక గతం చేశాడు శ్రీమన్నారాయణ
గర్భుడయిన ప్రత్యక్ష నారాయణుడు, సర్వ జీవకోటి ప్రాణ సంరక్షణైక శీలీ అయిన సాధు
సుందరతర మూర్తి, సూర్యనారాయణ మూర్తి. అల్లాంటి వేదాన్ని
తనదిగాచేసుకొని పరమ్పరాగతంగా కొనసాగి వచ్చేలా శిష్య పరంపరకు అందించగా, ఆ వరుసలో మా
అమృఉత వాక్కుల కుటుంబం కూడా అందుకొన్న అమృత ఫలమే శుక్ల యజుర్వేదం. ఆ స్వాధ్యాయంతో
నిత్య అగ్నిహోత్రాదులను పూజిస్తూ ఉన్న వంశం మాది. హనుమకొండను
కాకతీయులు పరిపాలిస్తూ ఉండగా మా పూర్వీకులు వారి బాగోగులను చూస్తూ మంచి మాటలతో
వారికి సలహాలనిచ్చేవారు. వారి ఆస్థానాలలో కవులుగా, పండితులుగా,
శాస్త్రఙ్ఞులుగా,విశేష ఆదరణను పొందారు. వీరి కవితావేశాన్ని, వీరి వేద విఙ్ఞాన
వైభవాన్ని చూసి సంతోషించిన రాజన్యులు- వీరి పలుకులు అనన్యసామాన్యాలు, "ఋషీణాం
పునరాద్యానాం వాచమర్థోనుధావతి" అన్నట్లు వీరి మాటలే కార్య రూపాన్ని ధరిస్తున్నాయి
అని వీరిని ఘనసన్మానాలతో తృప్తి పరచి గజ, తురగ, వజ్ర, వైఢూర్య, గోమేదిక,
మౌక్తికాదులతో సత్కరించి, ""అమృత వాక్కుల"" అనే బిరుదునామాన్ని ఇచ్చి ఉంటారని మా
పూర్వీకులే కాక, నిన్న మొన్నటి క్రీ.శ.1840 ప్రాంతపు బ్రహ్మశ్రీ నారాయణశాస్త్రి
గారి సమయంలో కూడా చెప్పుకొనే వారని మాతాతగారు,శ్రీ నరసింహ మూర్తిగారు తర్వాతి
తరాలకు మన ఔన్నత్యాన్ని చాటి చెప్పాలని, బాగా చదువు కోండని అంటూ ఉండేవారు.
ఈ పరంపర నిన్న మొన్నటి నారాయణ శాస్త్రి గారి వరకు ఉన్నట్లు
తెలుస్తోంది. వీరి ప్రాచీనులు యఙ్ఞయాగాదులు చేయడంలో దిట్టలు. వీరు మంత్ర శాస్త్రంలో
కూడా మంచి కీర్తిని సంపాదించినారని మాచిన్నప్పుడు వృద్ధులు చెప్పేవారు.
back to top
5.మా ముత్తాతగారు బ్రహ్మశ్రీ నారాయణ శాస్త్రి
నేటికి
150 సంవత్సరాల క్రితం నారయణ శాస్త్రి గారి గురించి మాత్రం బాగా తెలుస్తొంది. వీరు
ఆంధ్ర ప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు తాలూకాలో ఓగిడి అనే గ్రామంలో
ఉండేవారు. వీరికి కొంత పొలము పెద్దమండువా ఇల్లు ఉండేవి.వీరి పూర్వీకులు ఇక్కడ
అగ్రహరీకులుగా ఉండేవారని ప్రతీతి.
ఐతే వీరు ఉచితంగా భోజనాలు పెట్టి
వస్త్రాదులనిచ్చి వారి స్వంత మండువా లోగిలిలోనే వేద పాఠాలు చెప్పేవారు ఆని వారి
ప్రశిష్యులు ఇప్పటికీ వరి గురువులు చెప్పెనట్లుగా తెలుపుతున్నారు. మాతండ్రిగారైన
వేంకట సత్యనారాయణగారికి తమ తండ్రిగారు అంటే మా తాతగారు నారాయణ శాస్త్రిగారిని
గురించె తెలుపుతూ ఉండెవారట. ఐతే మాతండ్రిగారి చిన్నతనంలో వారి మామ్మగారు అంటే
పితామహి వెంకమ్మగారు జీవించియే ఉన్నారుట. అమ్దుకని మాతండ్రిగారికి వారి తాత గారిని
గురించి తెలుసు.
మాతాతగారు వేదవిద్వంసులేకాక మంత్రశస్త్రంలో కూడా నిష్ణతులు.
వారు పాము, తేలు మంత్రాలు వంటి చిన్న చిన్న ప్రయోగాలేకాక డయ్యాలనుకూడా వదిలించేవారు
అని ప్రసిద్ది. సంస్కృతభాషలోనూ ప్రయోగవిద్యలోనూ గొప్ప సాధన చేశారు అని అందరు
చెపుతూఉంటారు. వీరు వెంకమ్మగరనే సాధ్వీమతల్లిని వివాహం చేసుకొన్నారు . ఆమెకుడా
ఆయనకు తగిన భార్య . దాదాపుగా నూరుమంది వేద విద్యార్థులకు నిత్యం అన్నప్రసాద
వితరణ చేసిన అన్నపూర్ణ ఆమె. మా ముత్తాతగారు వేద విద్యను పంచి పెడుతూ ఉంటే
ముత్తమ్మగరు అన్నదానం చేస్తూ వచ్చారు. వారు చేసిన పుణ్యం వలననే తరువాతి వారికి
అందరికీ చదువులు వచ్చాయి. ఆనాటి ఇల్లు వాకిలి లేకపోయినా నేడు ప్రతి ఒక్కరూ స్వంత
ఇళ్ళను నిర్మించుకొని సుఖంగా జీవిస్తున్నారు.
మా వేద పాఠశాలలో చదివిన
వారిలో తుట్టగుంటావధానులు గారు అని ఒకాయన , ఇంకా తూర్పు గోదావరి జిల్లాలోని సఖినేటి
పల్లి గ్రామంలొని కొంతమంది వేద విద్వాంసులు ప్రసిద్దులుగా ఉండేవారు అని ఇప్పటికీ ఆ
యా పండితులదగ్గర చదువుకొన్నవారు లింగాలవారు , చిన్తా వారు చెబుతూ ఉంటారు. మా వేద
పాఠశాలలో పాఠాలు చెప్పడానికి మనకు తెలిసినంతవరకు ముగ్గురు ప్రసిద్దులుగా ఉన్నారు.
కొడమంచిలికి చెందిన దుర్గావరపు సత్యనారాయణగారు, మార్కొండపాడు గ్రామస్తులు అయిన
తుట్టగుంట అవధానిగారు , కోటిపల్లి గ్రామానికి చెందిన దేవరభొట్ల సుబ్బావదాన్లుగారు
సంహిత పాఠం, పదపాఠమ్, క్రమపాఠమ్, జట పాఠం,ఘనపాఠాలను చెబుతూ ఉండేవారు.
బ్రహ్మశ్రీ నారాయణశాస్త్రిగారు మంత్ర శాస్త్ర వేత్త అని చెప్పడం జరిగింది.
వీరి దేహాంతం కూడా ఈ కారణంగానే అయ్యింది అని అంటారు. వారు ప్రక్క పల్లెటూళ్ళో పిశాచ
బాధను తొలగించి వస్తూ ఉండగా వెనుకనుండి ఆ పిశాచ శక్తి వచ్చి ఆయనను దొంగదెబ్బ తీసి
చంపివేసింది. అక్కడే పొలము గట్టుమీద పడి ఆయన ప్రాణాలు విడిచారుట. ఓగిడి
ప్రాంతం అంతా బోసిపోయింది. దుఃఖవాతావరణం అలముకొంది. విషాదఛాయలతో ప్రజలంతా చింతించడం
మొదలు పెట్టారు. వేదపాఠశాల విద్యార్థులు అందరూ భోరు భొరున ఏడిచారు. నిలువునా కూలిన
చెట్టుమీద పిట్టలలాగ విలవిలలాడడం ఆరంభించారు. ఉపాద్యాయులంతా
నివ్వెరపోయారు.
మా ముత్తాతగారి హయాం వెళ్ళిపోయాక మాతాతగారి హయాము నాటికి ఆరు
ఎకరాల భూమి వేద పాఠశాలనడిచిన మండువాలోగిలి మిగిలాయి.
back to top
6.మాతాతగారు బ్రహ్మశ్రీ వెంకట
నరసింహమూర్తిగారు.బ్రహ్మశ్రీ నరసింహమూర్తిగారు తండ్రిగారి దగ్గర
సంస్కృతం, బాగా చదువుకొన్నారు. పంచ కావ్యాలలో దిట్ట. శ్లోకపఠనం ఆయనకు వెన్నతో
పెట్టిన విద్య . శ్లోకాన్ని ఎలా చదవాలో బాగా తెలుసు. నేను మేఘసందేశం చదువుకొనే
రోజులలో ఆయన మందక్రాంత వృత్తాన్ని చదివిన తీరు నన్ను ఆకర్షించింది. ప్రతి
అక్షరాన్నీ పట్టి పట్టి చదవడం సంస్కృతానికి చాలా అవసరమని చెప్పింది ఆయనే.
ప్రత్యక్షర విశేషం ఆయనకు తెలుసు. ఈయనకు ఆరుగురు మగ సంతనం ఇద్దరు ఆడ సంతానం.
ఓగిడిలోని దంతులూ, వాసాలూ మా ముత్తాతగారి హయాములో వేదాలు వల్లె వేస్తే, తాతగారి
హయాములో ఆయన కుమారులకు చెబుతూ వల్లె వేయించిన శతక పద్యాలూ, సంస్కృత శ్లోకాలు ఆ
వాసాలు వల్లె వేసేవి అంటే అతిశయోక్తి కానే కాదు.
ఈయనకు వేద విద్య వంట
బట్టినట్లు లేదు. కాని సంస్కృతం మాత్రం బాగా వచ్చింది, అనడంలో ఎంత మాత్రం అబద్దం
లేదు.
ఈయనకు లౌకిక జ్ఞానం ఎక్కువ అనే చెప్పాలి. తండ్రిగారు స్వర్గవాసులు
అయ్యాక వారు ఆ ఊళ్ళో పెద్ద మనిషిగా చెలామణి అయ్యారు. గ్రామీణమైన తగవులు తీర్చడం ఈయన
వంతు అయ్యింది. పొలాలు పుట్రలు అమ్మకాలు కొనుగోళ్ళు ఈయన ద్వారా జరిగేవి. వాటి రాత
కోతలు ఈయనే నిర్వహించేవారు. కొన్ని నాళ్ళు బియ్యం వ్యాపారం కూడా చేశారు. మొత్తం మీద
వ్యాపార దృక్పథం వీరి వంటికి పట్టింది. కనుక పిల్లలలో కూడా ఈ విధానాన్ని ప్రవేశ
పెట్టాలని ఉద్దేశించే వారు. అందుకేనేమో మానాన్న గారిని కూడా స్థానిక వ్యాపారి
బొడ్డు వీరాస్వామి దగ్గర కోమటి గుమాస్తాగా కుదిర్చారు.
ఈయనకు పెద్దగా ఆర్థిక
ఆదాయం లేని కారణంగానే వీరికి మిగిలిన ఆరు ఎకరాల భూమిని కొద్ది కొద్దిగా అమ్మి
ఆరుగురు కొడుకులనూ స్కూలు ఫైనల్ వరకూ చదివించి ఉపాధ్యాయ వృత్ర్తికి తగిన వారిగా
చేశారు.
ఉన్న మండువాలోగిలిని అమ్మివేశి ఒక అమ్మాయికి వివాహం చేశారు. రెండవ
అమ్మాయి వివాహం కోసం ఆ లోగిలి ఉన్న స్తలాన్ని కూడా అమ్మి వేశారు.మొత్తంమీద స్వార్థ
చింతన లేకుండా ఆయనకోసం ఏదో కావాలి అనుకోకుండా మానవ కర్టవ్యంగాను, గృహయజమాని బధ్యత
గాను పిల్లలను ప్రయోజకులను చేసిన ఉత్తమ బ్రాహ్మణుడు మాతాతగారు, బ్రహ్మశ్రీ
వేంకటనరసింహమూర్తిగారు.
వీరు తోలేటి వారి ఆడబడుచు అయిన చిరంజీవి కుంకుమ
సౌభాగ్యవతి సీతామహలక్ష్మిని వివాహం చేసుకొన్నారు. పచ్చని పసిడి చాయతో ఉన్న ఈమె అమృత
వాక్కుల వంశాభివృద్దికి మూలకందం ఆయ్యింది. అంతకు ముందు వరకు ఒకరిద్దరు సంతానం ఉన్న
అమృతవాక్కులవారుఇ వంశం ఈమె కడుపు చలువవలన బహు సంతానవృక్షంగా రూపు దిద్దుకొంది.ఈమె
పెద్దగా చదువుకోక పోయినా ఈమె సంతానం మాత్రం ఆనాటికి ఉన్న ఉన్నత విద్యలనే
పొందగలిగారని చెప్పవచ్చును.
back to top
7.శ్రీ వేంకటనరసింహమూర్తిగారిసంతానం
శ్రీ నరసింహమూర్తిగారి సంతానం కడిగిన ముత్యాల కోవగ కనిపిస్తుంది. నరసింహమూర్తిగారి పెంపకం కూడా అలాంటిదే. వారు తక్కువ ఆదాయంలో కూడా పిల్లల పెంపకపుబాధ్యతను చాలా చాకచక్యంతో సాగించారు. ధర్మ పత్ని శ్రీమతి సీతమ్మ గారితో వారి సఖ్యత కుటుంబపు నడతలు ఉత్తమంగా ఉండేవి. వారి గర్భశుక్తి ముక్తాఫలాలే వారి ఆరుగురు పుత్రులు మరి ఇద్దరు పుత్రికా రత్నాలు. వారిలో పెద్ధ వారు మా నాన్న గారు. బ్రహ్మశ్రీ అమృత వాక్కుల వెంకట సత్యనారాయణ గారు.
back to top
8.వెంకట సత్యనారాయణగారు.
వీరు ఆజానుబాహులు సన్నని శరీరం మిసిమి చాయ. ఎప్పుడూ నుదుట అక్కులు బుట్టు. అక్కులు బొట్టు అంటే సగ్గుబియ్యం మాడ్చి చేసె ఒక నల్లని బొట్టుకు ఉపయోగించేది. మాతాతగారు అరటి పువ్వు పై రెక్కలను కాల్చి బొట్టుగా తయారు చేసేవారు. దానిని ధరించి వీభూది పెండికట్లు నుదుటిమీద, డండలమీద, భుజాల వెనుక, ఉరఃపంజరానికి వెనుక ఇరు ప్రక్కలలోనూ, మోచేతికి చుట్టు భాగంలోనూ, మణికట్టు దగ్గర ధరిస్తూ ఉండేవారు. మానాన్న గారు,గోచీ పోసి పంచెకట్టు. మొదట్లో లాల్చీ ధారణ, తరువాతి రోజులలో పొడుగుచేతుల షర్టులు వెసుకొని ఎడమ భుజం మీద అంచుల కండువాను పైకి అంచులు కనిపించేలాగ వెసుకొని నడుస్తూ ఉంటే చూడగానే పెద్ద మనిషి అని వేరుగా చెప్పనక్కర లేకుండానే అందరూ అనుకొని గౌరవించే శరీర నిర్మాణం.
చిన్నప్పుడు కూడా చదువుమీద శ్రద్ధ ఉన్నా పల్లెటూళ్ళో ఉండడం వలననో, లేక సరయిన సహాధ్యాయులు లేకనో, లేక పెద్ద పిల్లవానిగా మోదటి సంతానం అవడం కారణం గానో, పాఠశాల దూరం కావడం వలననో చదువు కోవాలనే శ్రద్ధ తక్కువే.
ఒకమాటు కళ్ళు పోతే చదువుకోనక్కర లేదని కనురెప్పలు మూసుకొని జిల్లేడు పాలుకారుతున్న కొమ్మను కళ్ళమీద పెట్టుకున్నారుట. అయితే కళ్ళు పోతాయేమోనని భయమే మళ్ళీ.
తండ్రిగారైన నరసింహ మూర్తిగారు ఈయనను చదువు గురించి నిలదీయగా, చదువు మానేస్తానని చెప్పడంతో, వెంటనే ఒక కిరాణా కొట్లో గుమాస్తాగా చేర్చారు. దాంతో వ్యాపారంలో స్థిరపడతాననుకొన్న వారు మానాన్నగారు వెంకట సత్యనారాయణగారు
ఈయన క్రీ.శ.1926 లో అక్షయ నామ సంవత్సరంలో, విజయదశమినాడు పుట్టారు. క్రీ.శ.1940 లో హైస్కూలులో చదివేవారు. మార్టేరు అనే పశ్cఇమ గొదావరి జిల్ల ఆంధ్ర్ అప్రదేశ్లో చదువు.
అక్కడికి పెనుగొండ గ్రామం నుండి వెళ్ళి రావాలి. అంత దూరమ్ వెళ్ళీ వచ్చే ప్రయాణంలోనే శక్తి అంతా అయి పోయేది. దాంతో మార్కులు తక్కువ వచ్చేవి. చదువు అచ్చెకు రాదని నిర్ణయించుకొనే, కిరాణా కొట్లో గుమాస్తా అయ్యారు .
అంతే కాదు, వారి తండ్రిగారు మా తాతగారు నరసింహ మూర్తి గారు, ఆ రోజుల్లో ధాన్యం వ్యాపారం చేశేవారు. పంట వచ్చే కాలంలో 400, 500 బస్తాల ధాన్యం కొనడమ్, దాన్ని వర్షాకాలంలో 1 రూపాయి లాభానికి అమ్మినా, దాదాపు 4,5 వందల రూపాయలు లాభం వచ్చేది. ఆ రోజులలో 30 రూపాయలు ఉంటే చాలు, నెల రోజులు వీరి పెద్ద కుటుంబానికి సరిపోయేది. అంటే ఆరోజులలో వారి వ్యాపారం లాభ సాటిగానే ఉండేది. కనుక
నరసింహమూర్తిగారైన మా తాతగారు వ్యాపార రంగం
లాభ సాటిదని నమ్మారు
6
రూపాయల జీతానికి కుదరగానే, తెల్లగా సన్నగా ఉన్న బ్రాహ్మణ కుమారుని మీద నమ్మకం కుదిరి, ఈయన పేరుతో ఆనాడు పంచదార లైసెన్సుకోసం ఆవేదన పత్రాన్ని కూడా పంపారు.
ఇదే తడవుగా క్రీ.శ.1942 లో 6 రూపాయలు సంపాదిస్తున్న మంచి కుర్రాడు అని, మా అమ్మగారైన చి. లక్ష్మీ సౌభాగ్యవతి జ్యోస్యుల భూలక్ష్మిని ఇచ్చి వివాహం చేయడానికి మార్టేరు పంచకంలోని సత్యవరం కుగ్రామంలోని జ్యోస్యుల నరసయ్య గారి కోరిక మేరకు, మా తాత గారు శ్రీ నరసింహ మూర్తిగారు అంగీకరించారు. అంతే కాదు ఇంట్లో ఆరుగురు మగ పిల్లలు ఇద్దరు ఆడ పిల్లలు. పెద్ద వ్యాపారం, ఇల్లు పెద్ద మండువా. మా తాతగారి తల్లి గారైన నారాయణ శాస్త్రి గారి భార్యామణి వెంకమ్మ గారు అప్పుడప్పుడే మరణించారు.
ఇంట్లొ పిల్లలందరూ చదువులకు వెళ్ళి పొతారు. పైగా దొడ్లో పాడి పశువులు. వాటి చాకిరీ చేయవలసి ఉంది. ఇంట వంటపని కూడా చిన్న దేమీ కాదు.
మా బామ్మ గారు వివాహమయి మా తాత గారి చిటికెన వేలు పట్టి ఇంటికి వచ్చినప్పటి నుండీ అత్తగారి మడితో కూడిన వంటా వార్పులలో సంప్రదాయం కోసం ముసలమ్మగారే వంట చేసేవారు. అందుకే మా సీతమ్మ బామ్మగారు పెద్దగా ఇంటి పనిని చేయడంలో చెయ్యి తిరిగిన వారు కాలేక పోయారు. ఈ సమయంలో వంటా వార్పులకు ఒక స్త్రీ అవసరం ఉంది. ఈ పరిస్థితిలో కోడలు ఇంటికి రావడం అత్యవసరమని తాతగారు గమనించారు. సమయానికి మా అమ్మ గారు పెద్ద కోడలుగా వస్తుందంటే, చాలా సంతోషంగా అంగీకరించారు.
మానాన్న గారి వివాహం తేది క్రీ.శ. 25-2-1942 న జరగడానికి నిశ్చయం అయ్యింది.
మా అమ్మ గారి ఇంట్లో కూడా ఆరుగురు ఆడపిల్లలు, ఒకే మగపిల్ల వాడు. మా అమ్మ గారు 5 వ ఆడ పిల్ల. కనుక చిన్నతనంలోనే వివాహం చేయడం మంచిదే అని భావించారు. పైగా పెండ్లికొడుకుకు నెలకూ 6 రూపాయలు ఆదాయం వస్తోంది అని భావించారు.
వివాహానంతరం 2 సమ్వత్సరాలు గడిచాయి. 2 రూపాయలు జితం పెరిగింది. నాన్నగారికి వయస్సుతో పాటు భార్య కూడా రావడంతో నెలకు 30 రూపాయలైనా లేకపోతే నెల గడవదనే వివేకం వచ్చింది.
అనుకోకుండా తాతగారు నాన్న గారిని పిలచి "చదువుకుంటావా?" అని అడిగారు. మనిషికి అదృష్టమ్ ఎలా వస్తుందో ఎలా తెలుస్తుంది. మా నాన్నగారు "సరే" అన్నారు. తిరిగి మార్టేరులో ఫోర్త్ ఫారమ్ లో చేరారు. హెడ్మాస్టారు నాన్నగారిని స్కూలులో చెర్హుకొంటూ, "నాలుగు సంవత్సరాలు చదువులో జాప్యం జర | |