Home
Maagurimchi
Saahithyamu
Samskrithi
Devaalayaalu
Kalalu
Baala Saahithyamu
Charitra
Vaarthalu
Photo Gallery
 

కవిత్వం

కవిత్వం అనేది నేర్చుకొంటే వచ్చేది కాదని అంటారు. ఐతే పుట్టుకతో వచ్చే ప్రతిభ, దానినీ పెంచుకొనే భావమ్ అంటే వ్యుత్పత్తి., తగినంత కృషి అంటే అభ్యాసం అనే మూడూ ఉన్నవారికి కవిత్వం అబ్బుతుంది. ఈ కవిత్వశక్తి అభ్యాసం వలన మాత్రమే వస్తే ఆ కవిత్వం చాలా రోజులు నిలిచేదిగా ఉండదు అనేది అనుభవ సిద్ధంగా కనిపిస్తోంది.వ్యుత్పత్తి అనే గుణం బహు గ్రంథ పఠనం వలన కలుగుతుంది. ఐతే ఈ శక్తితో కవిత్వాన్ని అల్లేవారి కవితలలో వారు చదివిన కవితల ముద్ర గాని ఆయా కవుల ముద్ర గాని తప్పక కనిపిస్తూ ఇంటుంది. కనుక వారి కవిత్వం రాణించడం కష్టం అవుతుంది. ఇక ప్రతిభతో కవిత్వాన్ని అల్లేవారి గ్రంథాలు చిరస్థాయిగా నిలిచి పోతాయి . వాల్మీకి కాళిదాసు లంటి వాళ్ళు ఈ కోవకు చెందుతారు. కవిత్వం అనేది చాలా కాలం ఉండాలంటే అందులోని విషయం ప్రతి ఒక్కరికీ సంబంధించి "ఇది నాకథే " అని అనిపించేదిగానూ, ఆదర్శం, నీతి నియమాలు కలదై ఉండాలి. లోకోత్తర గుణోత్తరమైన కథానాయక లక్షణాలు అందులో నిరూపింప బడాలి. అప్పుడే ఆ కవి నిత్య పురుషుడుగా కీర్తిని ఆర్జిస్తాడు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. కొంతమంది ఆ సమయానికి తగిన విషయాలను తీసుకొని కవిత్వమో, లేక రచనలో సాగిస్తూ ఉంటారు. వాళ్ళ రచనలు కొద్ది రోజులు మత్రమే నిలుస్తాయి . తరువాత మరుగున పడిపోతాయి. ఉదాహరణకి స్వాతంత్ర్య సంగ్రామ దినాలలో వ్రాసిన కవితలు చరిత్రలో దాచగల్గితేనే ఉంటాయి. కాని మళ్ళీ మళ్ళీ చదవవలసినవిగా ఉండవు. సారాయి ఉద్యమం లాంటి ఉద్యమాలు కూడా ఇంతె. ఆ ఉద్యమమ్ చల్లారిపోయాకా ఎవ్వరూ తిరగేసి చూద్దాం అనుకోరు. కనుక మంచి ఇతి వృత్తాన్ని ఎన్నుకోవడం కవికి ఎంతైనా అవసరం అని వేరుగా చెప్పనక్కర లేదు.మనిషి మనుగడను గురించిన కవిత్వాలు నిలిచి పోతాయి .అయ్యో నేను చదవలేదు మీరు చదివారు కదా కొంతైనా చెప్పండి అని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నింప చేసే గ్రంథాలు ఇలాంటివే.రామాయణ భారతాలు అందుకే ఇప్పటికీ బ్రతికి ఉన్నాయి అంటే అతిశయోక్తి అంటారా? అననే అనరు. ఆ కవులలో సర్వ శాస్త్ర పండిత్య ప్రకర్ష ఉంది . అందుకే వాళ్ళు ఏ మాట చెప్పినా దానిని గుర్తు ఉంచుకొనే మాటగా తెలుసుకొని తమ నిత్య జీవితంలో ఉపయోగిస్తారు ఇది ప్రామాణికం అని ఫలానా కవి ఇలా అన్నాడు అని ఉట్టంకిస్తారు. కవిత్వం ఉపదేశాత్మకంగా ఉంటుంది కనుకనే ఈ కళ సదా నిలిచి పోతుంది.కవులను కీర్తిమంతులుగా చేస్తుంది. ఆచంద్ర తారార్కం ఆయన మాటలు అందరూ తలుచు కొంటూ ఉంటారు. ఆ కవిత్వమ్ నిజమైన కవిత్వం అనక తప్పదు. ఈ కవిత్వంలో ఉపదేశమే కాక ఇతర శాస్త్రాల జ్ఞానం కూడా ఉండడం విశేషం.

ఐతే అన్నీ ఇలాంటి కవిత్వాలే ప్రతి సమయం లోను పుట్టవు. సామయిక కావ్యాలూ, కవిత్వాలను రాస్తూ కవి ఆ కాలానికి ప్రజలకు ఏమి కావాలో దాన్ని ఉద్బోధిస్తూ ఉంటాడు . కనుక ఏ కవితనూ చులకనగా చూడనవసరం లేదు. కవిసమాజానికి నిజాన్ని తెలపడమే తన పనిగా భావించడం మంచిదే. ఆన్నీ పురాణాలూ ఇతిహాసాలూ ఐ పోలేవు కదా.కనుక కవిత్వాన్ని గురించి విశదీకరిస్తూనే కొన్ని ఆనందాన్ని కూర్చే కవిత్వాలు కూడా రావలి అని ఆశించాలి. ఇలాంటి వటిలో అవధాన సాహిత్యం కూడా గొప్పదె. ఐతే ఇది కూడా వెంటనే మరచి పోయేదే. ఐనా కొన్ని సమస్యలూ, దట్టపదులూ, చాలా కాలం నిలిచి ఉంటాయి ఎందుకంటే అందులో చమట్కారమ్, హాఅస్యమ్, ఆలొచనమ్ ఊమ్టాయి. ఉదాహరణకి

దట్టపది చూద్దాం. అSటావధానం అని. ఇది ఒక సాహిత్యపు ఆట అని చెప్పవచును. ఒక పండిటునికి ఎనిమిదిమంది పండితులు ఎనిమిది ప్రశ్నలు ఇస్తే ఆతడు ఛందొబద్ధ కవిత్వ రూపమయిన పద్యాలలో చెప్పాలి. అదీ ఒక్ పదం టరువాత మరొక పాదం అప్పటికప్పుడు చెప్పాలి . చివరగా నాలుగు పాదాలూ వప్పచెప్పాలి. అందులో ఎనిమిది ప్రశ్నలూ రక రకాలుగా ఉంటాయి. వాటిలో దత్తపది ఒకటి. అవధానాలను గురించి తిరిగి విశదంగా చర్చిద్దాం. హాస్యానికి దత్తపదిని చూద్దాం. దత్తపది అంటే నాల్గు పదాలు ఇచ్చి వాటిని నాల్గు పాదాలలోనూ కావలసిన అర్థంలో అవధాని చెప్పడం అందులో చిత్రమైన అర్థమ్ ఉండాలి.

ఉదాహరణకి

దోసె, పూరీ, వడ,సాంబారు అనే నాలుగు పదాలని నాల్గు పాదాలలో ఇముడ్చుతూ ఆ శబ్దంలోనిఅర్థంలో చెప్ప కూడదనేది నియమమ్.

ఈ పద్యాన్ని చూడండి


వర్ణన శివ కల్యాణం. శివుడికి దోసె, పూరీ ,వడ, సాంబారు అంటకట్టాలి.

పద్యం చూద్దామ!-

జడలో దోసెడు కొండమల్లికలతో సౌరభ్యముల్ చిమ్మి వ
చ్చెడు పూరీతిగ హాస చద్రికలతో సింధూరసీమంతియై
వడకున్ గుబ్బలి ముద్దుపట్టినుదుటన్ వాసంతియై నిలుచు ఆ
పడతిన్ పత్నిగ స్వీకరించితివి సాంబారుద్రా! సర్వేశ్వరా!!

ఈ పద్యంలో మొదటి పదంలోని జడలో దోసెడు అంటూ దోసె అనే శబ్దాన్ని దోసెడు నిండుగా అని వేరే అర్థంలో ఉపయోగించారు.రెండవ పాదంలో పూరీతిగ అనే చోటా పూరీ అనే శబ్దాన్ని పూవు వలే అనే వేరే అర్థంలో ఉపయోగించారు. అలాగే మూడవ పాదంలో వడ అనే శబ్దాన్ని వడకిపోవడం అనే అర్థంలో ఉపయోగించారు.
ఇక నాల్గవ పాదంలో చివరి భాగంలో సాంబా రుద్రా అంటూ సాంబారు అనేశబ్దాన్ని ఉపయోగించారు. ఇలాగ తెలుగు భాషకు మాత్రమే ఉన్న సౌలభ్యం సౌందర్యం అవధాన ప్రక్రియలోనూ పదాల విరుపులలోనూ ఉండడం వలన తెలుగు తేనెలొలుకు భాష అంటే అతిశయోక్తి ఎలా అవుతుంది?

మరొక దత్తపదిని చూద్దాం-

బీరు,బ్రాంది, విస్కీ,రమ్ము అనే నాలుగు పదాలూ నాలుగు పాదాల్లో వాడుతూ పద్యం ఆ శబ్దార్థాన్ని వాడకుండా చెప్పిన పద్యమ్ చూద్దాం.

అతివా గుండెలబీరువా తెరచి నీకర్పించుకుంటిన్ గదా
అతుల ప్రేమ మనోజ్ఞత్వము ఇక నబ్రాందీ కృత శ్యా
మతాన్వితమైన కటిసీమవెల్గు హృదయావిష్కీర్ణ సంకార్యమై
రతివో! రంభవో! రాధికారమణివో! రావే జగజ్జిన్నుతిన్.

ఈ పద్యంలో మొదటి పాదంలో గుండెలబీరువా అని "బీరు" అబ్రాందీకృత అని "బ్రాందీ" అనే శబ్దాన్ని హృదయావిష్కీర్ణ అనే చోట "విస్కీ" రంభవో అనే చోట "రం"అనే శబ్దాలు చెప్పడమేకాక జగజ్జిన్నితిన్ అనే చోట " జిన్" అనే శబ్దాన్ని కూడా చెప్పడం విశేషం . ఇది కవి చమత్కారానికి వన్నె తెస్తుంది.

ఒక్కకప్పుడు చాలా బాధగా ఉన్నవారిని ఊరడించడానికి మంచి ఉపాయం సహిత్యం. కొన్ని పద్యాలు వింటే ఎంత బాధనైనా మరచిపోతాం. ఉదాహరణకి
తెలుగులో గాడిద అని గాడిదకొడకా అని పిల్లల్ని తిడుతూ ఉంటాం. అప్పుడు ఒక గాడిద విని ఇలా అనుకొంటోంది-

కం||

ఆడిన మాటను తప్పిన
గాడిదకొడుకంచు తిట్టగా విని
వీడా నాకొక కొడుకని
గాడిద ఏడ్చెన్ గదన్నఘన సంపన్నా!!

ఇలాగ తెలుగులో ఎన్నో రకాల పద్యాలు దొరుకుతాయి.

సంగీతం

సంగీతం ప్రాణులకు హాయిని కలిగించేదే కాక మోక్షాన్నిచ్చేది కూడాను.

శ్లో|| శిశుర్వేత్తి పశుర్వేత్తి

వేత్తి గాన రసం ఫణీ

అని గాన రసాన్ని అనుభవించి ఆనందించనివారు ఉండరు. సంగీతానికి ఆది సామవేదం. సామ మంత్రాలు గానంలాగే పాడబడతాయి. సంగీతంలో నాదం చాలా గొప్పగా చెప్పబడుతుంది. రాగం, తాళమ్, స్వరం సంగీతంలో ప్రథానాంశాలు.

శృతి ప్రధానమైనది సంగీతం. శృతి తప్పితే ఆ గాయకుడు ఇక సంగీతాన్ని పాడడం మానివేయవచ్చని భావిస్తారు.

రాగం అనేది ఈ శాస్త్రానికి ప్రాణంలాంటిది. తాళం పాడేవారిని సరయిన మార్గంలో తీసుకొని పోవడానికి ఉపయోగిస్తుంది. ఇది ఏ రాగాన్నైనా ప్రపంచం అంతా ఒకేలాగ పాడే లాగా నియమించగలదు.

సంగీతానికి స్వరమాధుర్యం చాల అవసరమైనది. అక్షరాలను నోట్లో ఎక్కడ పలకాలో అక్కడ పలికితేనే సరయిన సంగీతం అనిపించుకొంటుంది. అల్లాకాఅక స్వర పేటికకు ఇష్టం వచ్చేలాగ పాడితే అది సంగీత సరస్వతి చేత అంగీకరింపబడదు.

నాదం అనేది సాధారణంగా ఓంకారన్ని చెబుతారు కదా. అదే పరిస్థితి సంగీతంలో కూడా.నాదం బ్రహ్మ అని చెబుతారు. సంగీతోపాసనను బ్రహ్మోపాసన అని అంటారు.కనుక సంగీతవిద్వాంసులు వేదవిద్వాంసుల వలెనే నిష్ఠాగరిష్ఠులయి త్యాగరాజాది మహానుభావులను పూజిస్తూఉంటారు.వీరు నిత్యారాధనలు సంగీతంలోనే కానివ్వడం విశేషం.

సంస్కృతి సంప్రదాయలను సంరక్షిస్తూ నేటికీ సంగీత ప్రియులు ప్రాచీన వాగ్గేయకారుల జయంతులు చేస్తూ ఉన్నారు.

త్యాగరాజు, శ్యామశాస్త్రి,ముత్తుస్వామి దీక్షితులు క్షేత్రయ్య, అన్నమయ్య, నారాయణతీర్థులు మొదలయినవారు ప్రధానంగా చెప్పుకోదగిన వాగ్గేయకరులు.


శ్రీ అమృతవాక్కులసత్యనారాయగారు.