|
|
|
 |
| |
మా కన్నతల్లికి
మా కన్నతల్లికి మఙ్గళారతులు,
కడుపులొ బంగారు కనుచూపులొ కరుణ,
చిరునవ్వులో సిరులు దొరలిన్చు మా తల్లి.
గలగలా గొదారి కడిలిపొతున్టెను
బిరబిరాకృష్ణమ్మ పరుగులిడుతుంటేను
బన్గారు పంటలె పండుతాయీ
మురిపాల ముత్యాలు దొరలించు మాతల్లి.
అమరావతీ గుహల అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులొ తారడు నాదాలు,
తిక్కయ్య కలములొ తియ్యందనాలు
నిత్యమై నిఖిలమై నిలచి యుండేదాక,
రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి,
తిమ్మరసు ధీయుక్తి,కృష్ణరాయల కీర్తి
మా చెవులు రింగుమని మారు మ్రోగేదాక
నీ ఆటలే ఆడుతామ్,నీ పాటలే పాడుతాం
జై తెలుగు తల్లి,జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి......
మన తెలుగు దేశం సామాన్య వివరాలు
రాష్ట్రం పేరు - ఆంధ్రప్రదేశ్
మాట్లడే భాష - తెలుగు
రాష్ట్రావతరణ -
తేది - 01-11-1956 క్రీ.శ.
రాష్ట్రావతరణ కారకుడు- పొట్టిశ్రీరాములు
రాష్ట్ర పక్షి - పాలపిట్ట
రాష్ట్ర గీతం - మాతెలుగుతల్లికీ మల్లెపూ దణ్డ
రచయిత - సుందరంబాడి రంగాచార్య
తెలుగు ప్రజలు - భారతదేశంలో హిందీ తరువాత అధికసంఖ్యలో ఏకభాషా భాషులు.(తెలుగు)
తెలుగుదేశం వైశాల్యం - 27 లక్షల 70 వేల 916 చ.కి.మీ.
జిల్లాల సంఖ్య - 26
పంటలు -
వరిధాన్యము, పొగాకు, చెరకు, మిర్చి, మామిడి , అరటి, ప్రత్తి, పసుపు మొదలయినవి.
ఖనిజాలు -
రాక్షస బొగ్గు, ఆస్బెస్టాస్, రాగి,మాన్గనీసు,సున్నపురాయి, అభ్రకము మొదలయినవి
ఎగుమతి వస్తువులు -
ఉక్కు, మామిడి, వరి,దుస్తులు మొదలయినవి
కర్మాగారలు -
నౌకానిర్మాణము, స్టీల్ ఫ్యాక్టరీలు, సిమెంటు, బ్యాటరి, ఝూట్, చక్కెర,ఆధునిక సమగ్రి.
విశ్వ విద్యాలయాలు -
ఆంధ్ర, ఉస్మానియ, వెంకటేశ్వరా, కృష్ణదేవరాయ,నాగార్జున, జవహర్లాల్, పద్మావతి, పొట్టిశ్రీరాములు,ఎన్.టి.రామారవు, అంబేద్కర్, కాకతీయ, వైద్యవిశ్వవిద్యాలయాలు, వ్యవసాయ విశ్వ విద్యాలయాలు, పశు వైద్య విశ్వవిద్యాలయాలు,మొదలయినవి.
నదులు - గోదావరీ,కృష్ణా,పెన్నా,సువర్ణముఖీ,తుంగభద్రా,కల్యాణి మొదలయినవి.
సరస్సులు-
కొల్లేరు,పులికాట్.
ప్రధన మతాలు
హిందూ, మహమ్మదీయ,క్రైస్తవములు.
భోజనం-
వరి అన్నం,రాగులు,సజ్జాలు.
దుస్తులు-
పురుషులు-పంచె, కండువా,జుబ్బా,
స్త్రీలు- చీర,జకెట్టు.
ఆడపిల్లలు- పరికిణీ ,జకెట్టు, ఓణి.
మగపిల్లలు- నిక్కరు, చొక్కా.
పండుగలు- ఉగాది,వరలక్ష్మీవ్రతమ్, నవరాట్రి, క్ర్ఠిష్ణ్నాష్టమి, సంక్రాంతి,రామనవామి మొదలైనవి. అన్ని మాసాలలోను పండుగలు ఉంటాయి.
శాస్త్ర విఙ్ఞానమ్-
రాకెట్లాన్చింన్గ్ (శ్రీహరికోట).మందులకంపెనీలు చాలాచోట్ల. ఉన్నాయి
వైద్యం-
ఇంగ్లీషు మందులు,ఆయుర్వేదమ్, హోమియోపతి,యునానీ వైద్యలు ప్రసిద్ధాలు, నాటు మందులుకూడాను.
భారత స్వాతంత్ర్య సమరంలో తెలుగు వీరులు -
రాణి రుద్రమ దేవి,అల్లూరి సీతారామరాజు, సరొజినీ నాయుడు,ప్రకశం పంతులు, భోగరాజు పట్టాభిసీతారామయ్య, తెన్నేటి విశ్వనథం,బూర్గులరామకృష్ణరావు.తదితరులు పెర్కొనతగినవారు కో క్కొల్లలుగా ఉన్నారు.
నిత్యం జ్ఞాపకం ఉంచుకో తగినవారు
శ్రీ పిమ్గళి వెంకయ్య
భారత దేశపు మువ్వన్నెల జండా తయరు చేసినవారు-
పింగళి వెంకయ్య
తెలుగు పాలకులు-
శ్రీ పి.వి.నరసింహారావు, సర్వేపల్లి రాధాకృష్ణన్,వి.వి. గిరి
నీలం సంజీవరెడ్డి.
పరిశ్రమలు- మత్స్యపరిశ్రమ, వ్యవసాయపనిముట్లు, ఇనుము, సిమెంటు, చక్కెర, నూనెలు, మొదలైనవి.
ఆనకట్టలు - నాగార్జునసాగర్, శ్రీశైలమ్, పోచంపాడు, రొంపేరు, కళ్యాణీ,ప్రకాశం బ్యారేజీ, కాటన్ బ్యారేజి, మొదలైనవి.
విద్యుదుత్పత్తి స్తానాలు- మాచ్ఖండు, నాగార్జునసాగర్, శ్రీశైలం, సీలేరు, దిగువ సీలేరు, నిజంసాగర్, నెల్లూరు,రామగుండం, కొత్తగూడెం,
పరిశ్రమలు- మత్స్యపరిశ్రమ, వ్యవసాయపనిముట్లు, ఇనుము, సిమెంటు, చక్కెర, నూనెలు, మొదలైనవి.
ఆనకట్టలు - నాగార్జునసాగర్, శ్రీశైలమ్, పోచంపాడు, రొంపేరు, కళ్యాణీ,ప్రకాశం బ్యారేజీ, కాటన్ బ్యారేజి, మొదలైనవి.
విద్యుదుత్పత్తి స్తానాలు- మాచ్ఖండు, నాగార్జునసాగర్, శ్రీశైలం, సీలేరు, దిగువ సీలేరు, నిజంసాగర్, నెల్లూరు,రామగుండం, కొత్తగూడెం,
ఆంధ్ర దేశం-ఆంధ్ర ప్రజలు
భారత దేశచరిత్రలోనే అతి ప్రాచీనము అతి ప్రధాన దేశము గానూ వీరుల దేశంగానూ పేరు పొందినదీ ఆంధ్ర దేశం. ఈదేశానికి స్వతంత్ర ప్రతిపతిపత్తి ఉడేది. భారతీయ చరిత్ర సంస్కృతీ పరిణాలలోను మతాల వ్యప్తి విషయంలోనూ తెలుగు దేశానికి ఒక వైశిష్ట్యం ఉంది అనడంలో ఎంతమాత్రంసందేహం లేదు. నిర్దిష్టమైన భౌగోళిక ప్రాంతంగా ప్రత్యేకతలను సంతరించుకొన్న భాషను కల ప్రజలతో కూడుకొన్నదిగా ఆంధ్ర దేశం ఆంద్ర ప్రజలూ పేరు పొందడమేకాక వీరే తెలుగువారు అనే గుర్తింపుగల జాతిగా రూపుదిద్దికొన్నది తెలుగు జాతి. వేద కాలంనుండీ భారత స్వాతంత్ర్య సంగ్రామంవరకూ సూక్ష్మ దృష్టితో (మైక్రోస్కోపిక్ వ్యూలో) గాని లేక స్థూల దృష్ట్రితో గాని చూస్తే ఆంధ్రులు చేసిన ఘన కార్యాలు ఎన్నో ఉన్నాయి. తెలుగు మాట్లాడే వారి దేశంగా ఆంధ్ర ప్రదేశ్ అవతరించినా ఆంధ్ర దేశంలో ఇతర రాష్ట్రాల వారు ఎందరో ఉన్నారు. అలాగే ఆంధ్రులు ఇతర రాష్ట్రాలలోనూ ఇతర దేశాలలోనూ చాలామంది నివశిస్తూ, వారి మంచితనం వలన వారి కార్యనిర్వహణ దక్షత వలనా ఉన్నత స్థానాలను, ఉత్తమ ప్రశంశలనూ అందుకొంటూ ఉన్నారు
ఒక రోజుల్లో తంజావూరు వరకు దాదాపు దక్షిణ దేశం అంతా తెలుగు రాజుల పాలనలో ఉండి తెలుగు భాష వ్యప్తిని, ఇతరులమన్నననూ పొందింది.
ఆంధ్ర దేశం స్థల నిర్దేశం-
ఆంధ్రుల మాతృ భూమిగా చెప్పబడే తెలుగు దేశం లేక ఆంధ్ర దేశం భారత దేశంలో దక్కను పీఠ భూమికి పూర్వార్థ భాగంలో ఉత్తరార్యావర్తంగా దక్షిణ దావిడ ప్రాంతంలో ఉన్నధాన్య లక్ష్మి. వరి ధాన్యానికి ఇది పేరుమోసొన ప్రదేశం.
కనుకనే అటు ఉత్తరభారతసంప్రదాయలకు, ఇటు దక్షిణ ప్రాంతాలకూ ఇది వారధిగా కనిపిస్తుంది. ఔత్తరాహులు దక్షిణ భారతం లోకి అడుగు పెట్టాలంటే తప్పక కృష్ణా నదిని దాటవలసినదే. ఈ కృష్ణా నది మహారాష్ట్రలో పుట్టినా ఆంధ్ర దేశంలో విస్తృతంగా ప్రవహించి తెలుగు మాగాణాన్ని సస్య శ్యామలం చేస్తోంది. నిజానికి ఆర్యావర్తం అంటే ఉత్తర దక్షిణ అదేశాల సంస్కృతీ సమాగమమే అని అందరూ ఒప్పుకొంటారు. ఈ భారతీయ సంస్కృతిలో ఆంధ్రుల ముద్ర బాగా కనిపిస్తుంది. ఈ సంస్కృతి క్రీస్తు శకారంభంలోనే ఆగ్నేయాసియా దేశాలకు కూడా వ్యాపించింది. ఆంధ్ర దేశపు పొరుగు రాష్ట్రాల సంస్కృతీ, ఆచారాలు, అలవాట్లు ఆయా ప్రదేశాల సంస్కృతితో మిళితమైనట్లే వీరి సాన్నిహిత్యం వలన వారు కూడా ప్రభావితులయ్యారు. ఆంధ్ర దేశానికి చుట్టూ క్రింది భాగంలో తమిళనాడు,కర్ణాటక, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాలు ఉండడం వలన ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు వీరందరి ఆచారాలనూ కూడా బాగా అర్థం చేసుకొన్నవారు అవుతారు.
ఆంధ్ర దేశం లోపలి భాగమ్ ప్రధానంగా మూడు భాగాలుగా కనిపిస్తూ వేరు వేరు ఆచారాలతోటి, వేరు వేరు యాస గల భాషలతోటి విరాజిల్లుతోంది. ముఖ్యంగా ఇవి కోస్తా ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణా అని పిలువబడతున్నాయి. రాజకీయ వైవిధ్యం ఉన్న సాంస్కృతిక ఐక్యత గల ప్రదేశం ఆంధ్ర ప్రదేశ్. ప్రస్తుతం ఆంధ్రదేశంలోని మూడు భాగాలలోని జిల్లాల పేర్లు ఇలా ఉన్నాయి.
అకారాది క్రమంలో
1. ఆదిలాబాద్
2. అనంతపురమ్ జిల్లా
3. చిత్తూరు జిల్లా
4. కడప జిల్లా
5. కరీమ్ నగర్ జిల్లా
6. ఖమ్మం జిల్లా
7. కృష్ణా జిల్లా
8. కర్నూలు జిల్లా
9. గుంటూరు జిల్లా
10.తూర్పు గోదావరి జిల్లా
11.నల్గోండ జిల్లా
12.నెల్లూరు జిల్లా
13.నిజామాబాదు జిల్లా
14.పస్చిమగోడావరి జిల్లా
15.మహబూబ్నగర్ జిల్లా
16.మెదక్ జిల్లా
17.రంగారెడ్డి జిల్లా
18.శ్రీ కాకుళం జిల్లా
19.విశాఖపట్టణమ్ జిల్లా
20.విజయనగరం జిల్లా
21.వరమ్గల్ జిల్లా
తెలుగు దేశం ప్రాచీనత
ఆంధ్రులను గురించిన అతి ప్రాచీన ప్రస్తావన ఐతరేయ బ్రాహ్మణంలో కనిపిస్తుంది. అటు తరువాతి కాలంలో శ్రీమద్రామయణంలోను, మహాభారతంలోను, పురాణాలలోనూ ఆంధ్రుల ప్రస్తావన వచ్చింది. మొదటిగా తెలుగువారు ఆర్యకుటుంబంలోని వారే. ఐతే తరువాతి రొజులలో దక్కను ప్రాంతానికి వచ్చి స్థానికులైన ద్రావిడ జాతి వారితో కలిసిపోయారు అనేది చారిత్రకంగా చెప్పబడుతోంది. ఆంధ్రులను గురించి ఆధునక చారిత్రకాధారాలను బట్టి చెప్పేవారు క్రీస్తు పూర్వం 4 వ శతాబ్దంలో భారత పర్యటన చేసిన మెగస్తనీసు వ్రాసిన వ్రాతలను బట్టి తెలుస్తోది. మూడవ శతాబ్దంలోని అశోక చక్రవర్తి సాసనాల్లోకూడా ఆంధ్రుల ప్రస్తావన వచ్చింది. ఐతే ఆరొజుల్లో ఆంధ్రులది ఒక ఆదివాసి రాజ్యం అని పెర్కొంటారు.
కాని మెగస్తనీసు, అశోకుల కంటె కూడా ప్రాచీనములైన భారతీయ వేదసంబంధులైన బ్రాహ్మణ గ్రమ్థాలలోను, రామాయణ భారతాలలోనూ వీరిని గురించి చెప్పబడింది అన్నాక మెగస్తనీసు, అశోకుల మాట ఈ విషయాన్ని బలోపేతం చేస్తోందని చెప్పాలే కాని వారిదే ప్రధాన ఆధారం అని చెప్పనక్కరలేదు. కొందరు ఆధునికులు భారతీయ చరిత్రను చెప్పే ఇతిహాసాలను, పురాణాలను పుక్కిటి గ్రంథాలని చెప్పి వాటికి విలువలనీయక పోవడం భారతీయ గ్రంథాలను కించపరచడమే.
ఆంధ్రుల రాజకీయ చరిత్ర
ఇతిహాసాలలో పెద్ద యుద్దాలలో పాల్గొన్న యుద్ధవీరులని చెప్పిన తరువాత కూడా చరిత్రకారులు నేడు అశోకునికాలం తరువాత మాత్రమే ఆంధ్రులకు రాజకీయ చరిత్ర ఆరంభం అయ్యిందని అంటున్నారు. ఏది ఏమయినా కనీసమ్ 3,4 శతాబ్దాలకు వీరి ఉనికిని ఒప్పుకున్నాక ఆంధ్రులు దాదాపు ఈనాటికి 2400 సంవత్సరముల క్రితమే చరిత్రకెక్కిన జాతి అని నిఖ్ఖచ్చిగా తెలుస్తూనే ఉంది. అశోకుని అస్తమయం వరకు వీరు అన్య రాజుల అధీనంలో ఉన్నట్లు, తరువాత స్వతంత్ర రాజ్య స్థాపన చేయగలిగారని చరిత్రకారుల మాట.
ఆంధ్రుల మొట్టమొదటి పాలకులు
శాత వాహన రాజ వంశీకులు మొదటిగా ఆంధ్ర రాజ్య పాలకులుగా విలసిల్లినారు. వీరు నాలుగు శతాబ్దాల పాటు పరిపాలించారు. త్వరలోనే వీరి రాజ్యం ఒక విశాల సామ్రాజ్యంగా విస్తరిల్లింది. అప్పుడు యావత్ దక్కను ప్రాంతాన్నీ పాలించగలిగిన రాజులు శాతవాహనులే.
అప్పుడపుడు ఉత్ర్తర దేశ ప్రాంతాలను, దక్షిణంలోని తమిళప్రాంతాన్ని కూడా తాకింది.ఆంధ్ర దేశ సింహాసనాన్ని ఆంధ్ర శాత వాహన రాజులు క్కొన్నాళ్ళు అధిష్ఠించారు కనుక ప్రాచీన భారత సామ్రాట్టులలో శాతవాహనులవంశం కుడా చెర్చబడింది. వీరు మంచి యుద్ధ వీరులుగా పేరుపొందారు.అనేక యుద్ధాలను త్రిప్పి కొట్టారు. కళలు, సాహిత్యం,మతాలు ఆనాడు ఉత్తమంగా పోషించబడ్డాయి. శాత వాహన కాలంలో ఆంధ్ర దేశం ఆర్థికంగా బలోపేతం అయ్యింది.
శాతవాహనులలో ప్రథమ ద్వితీయ సాతకర్ణులు, గౌతమీ పుత్రసాతకర్ణి, యజ్ఞ ప్రభృతులు ప్రాచీన భారత దేశంలో గణుతికెక్కిన రాజన్య మూర్ధన్యులు.
శతవాహన రాజ్యాన్ని గురించి విపులంగా తిరిగి వివరిస్తాను.
శాతవాహన యుగానంతరం క్రీ. శ. 3 వ శతాబ్దం చివరి భాగంలో శాతవాహన సామ్రాజ్యం పతనమయ్యింది.
ఆంధ్ర దేశం చీలిపోయింది. తెలంగాణా ప్రాంతం వకటకుల తొలి బాదామి చాణుక్యుల అధీనం లోకి వచ్చింది. కోస్తా ఆంధ్ర ప్రాంతం ఇక్ష్వాకుల అయిన సాలంకాయన రాజుల పాలనలోకి పోయింది. తర్వాత విష్ణు కుండినులు పాలించారు. ఆగ్నేయ ప్రాంతం పల్లవరాజుల చేతులలొకి వచ్చింది. క్రీ.శ.5 వ శతాబ్దంవరకు గోదావరి మండలాన్ని రకరకాల రాజ వంశాలు పాలించాయి.అప్పటికి తూర్పు గంగ వంశం రాజ్యాన్ని స్థాపించింది.
క్రీ.శ. 7 వ శతాబ్దం తొలి భాగంలోతూర్పు చాళుక్యులు కోస్తా ఆంధ్ర ప్రాంతానికి పాలకులు తమ ఏలుబడ్ని సాగించారు. వీరు సుమారు 400 సంవత్సరాలు రాజ్య పాలన ప్రశాంతంగా చేశారు.మొదట రాష్ట్ర కూటులు ,తరువాత చాళుక్య వంశజులు తెలంగాణా ప్రాంతాన్ని తమదిగా ఏలినారు. తెలుగు చాళుక్యుల్లో ఒక శాఖ అయిన పల్లవులు, చామలు, వైదుంబరులు కొంతకాలం రాయల సీమను పాలించారు. తరువాత చోళ సామ్రాట్టుల వశం అయ్యింది. ఈ భాగం ఈ కాలంలో అంతర్యుద్ధాలు, నిరంతర దండ యాత్రలు, రాజకీయ సంక్షోభంతో కాలం గడిపారు. అటు యుద్ధ కాలంలో ఇటు శాంతికాలంలో ఈతరుణంలో ప్రసిద్ధికెక్కారు. ఇక్ష్వాకులకు చెందిన కంతు మూలుడు విష్ణు కుండిన రాజైన మొదటి మాధవ వర్మ, మొదటి విష్ణు వర్ధనుడు నరేంద్ర మృగ రాజ విజయాదిత్యుడు గుణ గణ విజయాదిత్యుడు రాజ రాజులుగా ప్రసిద్ధి చెంది ఉత్తమ రాజులుగా వెలుగొందారు.
కాకతీయ యుగం
క్రి.శ. 11వ శతాఅబ్దం మధ్య భాగలో అంధ్ర దేశం పరిస్థితి అస్తవ్యస్తంగా తయారు అయ్యింది. చాణుక్యుల అధికారం తగ్గిపోయింది. తెలంగాణాలో పౌవురు తెలుగు సామంతులు స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకొన్నారు. కోస్తా ఆంధ్ర ప్రాంతంలో కూడా రకరకాల రాజ వంశాలు ఏలుబడికి వచ్చాయి తెలుగు చోళులు, తెలుగు పల్లవులు వంటి చిన్న చిన్న రాజులు చోళుల ఆధిపతుయంలోనుండి చీలిపోయి నెమ్మదిగా వేరు రజ్యాధిపతులుగా
అవుతూ వచ్చారు. ఈ అస్త వ్యస్త స్థితినుండి ఓరుగల్లు కాకతీయ సామ్రజ్యం ఆవిర్భవించింది. మొదట్లో కాకతీయులు తెలంగాణాలో చోళులసామంతులుగా ఉండేవారు. రెండవ ప్రోలుడనే సాహస విరుడైన రజు కాలంలో వీరు స్వతంట్రిఅంచారు. ఆయన తరుఅవాత సింహాసనానికి వచ్చిన రుద్రదేవుడు కోస్తా ఆంధ్ర ప్రాంతం మీద, రాయలసీమ ప్రాంతం మీదా కూడా దండయాత్రలు చేసి ఆంద్రులనందరినీ కాకతీయ సామ్రాజ్యపు జండా క్రిందికి తీసుకొని వచ్చాడు.ఈ సామ్రాజ్యాన్ని రాణి రుద్రమ దేవి నిర్వహించేది.కాకతీయ రాజులలో చివరివాడు , రుద్రమాంబ మనుమడు అయిన రతాపరుద్రదేవుని కాలంలో ఢిల్లీ సుల్తానుల దండయాత్రలు ముమ్మరం అయ్యాయి.మహమ్మదీయుల డండయాత్రలను నిరోధించడంలోనూ, తరువాత హైందవ పునరుద్ధరణలోను ప్రతాపరుద్రుడు ప్రధాన వ్యక్తిగా చెప్పుకో తగిన మహారాజు అని అనవలసినదే.
కాకతీయుల కాలంలో ఆంధ్ర దేశం ఆర్థికంగా మంచి బలాన్ని సంపాదించడంతో పాటు లలిత కళలలోను , సాహిత్య రంగంలోనూ చాల గొప్ప ప్రగతిని సాధించింది. అటు సంస్కృతంలోనూ ఇటు తెలుగులోనూ కూడా కవులను శాస్త్రకారులనూ ఉత్సాహ పరచి వారిని పోశించి మంచి సేవలనందించాడు.
కాకతీయానంతర దశ.
క్రీ.శ. 1323 లో కాకతీయ సామ్రాజ్యం అంతరించింది. మళ్ళీ రాజకీయ అస్థిరత అలముకొంది. మహమ్మదీయ దండయాత్రలు ముమ్మరం చేశారు ఆక్రమణలు తీవ్ర తరం అయ్యాయి. యువరాజుగా ఉన్న సుల్తాన్ మహమ్మద్ తుగ్లక్ ఓరుగల్లును స్వాధీనం చేసుకొని తూర్పున నెల్లూరునుండి పశ్చిమాన క్విలన్ వరకు దక్షిణాపథాన్ని జయించి ఆక్రమించాడు. తన అధీనంలో ఈ ప్రాంతాన్ని పాలించడానికి ముస్లిం గవర్నరును నియమించాడు. ఆంధ్రప్రజలు ఈ ప్రమాదాన్ని గ్రహించారు . సత్వరమే తిరుగుబాటు ప్రారంభించారు. కాపయనాయకుడు, ప్రోలయ వేముడు, సింగమనాయకుడు వంటి వారు ముస్లింలను తరిమికొట్టి, దేశాని స్వతంత్రం చేశారు.
ఈ సంక్షోభదశ నుంచి అనేక కొత్త రాజ్యాలు తలెత్తి వచ్చాయి. కొండవీటి రెడ్డిరాజ్యం, రాచకొండ వెలమరాజ్యం ,1336 లో హరి హర బుక్కరాయ సోదరులు స్థాపించిన విజయనగరరాజ్యం ఇలా ఏర్పడినవే. క్రి శ 1347 లో దక్షిణాన స్వతంత్ర ముస్లిం రాజ్యంగా బహమనీ రాజ్యమ్ ఏర్పడింది. ఈ బహాఈ మహమ్మదీయ రాజులు నిరంతరం హిందూ రాజులతో పోరాటాలు సాగిస్తూనే ఉన్నారు. రెడ్డి , వెలమ రాజులు మంచి పడితులు ,పండిత పోషకులు, వారిలో కుమారగిరి, పెదకోమటి వేముడు, కాటమ వేముడు వంటి రెడ్డి రాజులు ,సింగ భూపాలుని వంటి వెలమ రాజులు గొప్ప గ్రంథ కర్తలుగా కూడా ప్రసిద్ధిని పొందారు. ఈ కాలంలోనే ప్రసిద్ధాంధ్ర కవి యుగ కర్త శ్రీనాథుడు తెలుగు తల్లికి సాహిత్యపరంగా ఎనలేని సేవ లందించాడు. రాజులను కూడా తన పర్యటనలలో తన ఇష్టం వచ్చినట్లు దూషించగల చనువును స్వాతంత్ర్యాన్ని సంపాదించాడు. కవి పుంగవులను గౌరవించే సంప్రదాయాన్ని రాజులకు నేర్పాడు.
కుతుబ్ షాహీ యుగం
క్రీ. శ. 1521 లో కుతుబ్ షాహి రాజులు గోల్కొండను కేంద్రంగా చేసుకొని తెలంగాణాలో స్వతంత్ర మహమ్మదీయ రాజ్యాన్ని స్థాపించారు. ఒరిస్సాలోని గజపతి రాజులు కుతుబ్ షాహీలు
చివర విజయనగర రాజులూ తమ తమ రాజ్యాల విస్తరణ కోసం , తమ తమ ఆధిపత్యం కోసం పరస్పరం చాలా తీవ్రంగా కలహించు కొంటూ వచ్చారు. చివరికి కుతుబ్ షాహీ రాజులు ఆంధ్ర ప్రాంతంలో ఎక్కువ ప్రాంతాన్ని తమ పరిపాలన క్రిందకి తేవడంలో కృత కృత్యులయ్యారు. గోల్కొండను మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు జయించిన తరువాత గోల్కొండ రాజ్యం మొఘలుల రాజ్యంలో కలిసిపోయింది. కుతుబ్ షాహీ రాజుల కాలంలో జరిగిన ఒక ముఖ్య మైన పరిణమమ్ -ఫ్రెంచి, ఇంగ్లీషు వర్తకులు వచ్చి ఆంధ్ర దేశంలో పలు ప్రంతాల్లో తమ వ్యాపారానికి కేంద్రాలుగ ఏర్పాటు చేసుకోవడం.
నిజాం రాజుల పాలన
క్రీ. శ. 1723 నాటికి దక్కనులో మొఘలులు నియమించిన సుబేదారులుగా ఉన్న నిజం-ఉల్-ముల్క్ ఆతని తరువార్త వారూ నిజామ్ వంశస్థులుగా పేరు పొంది ఆంధ్రదేశానికి పరిపాలకులుగా మారిపోయారు. ఆ తరువాత ముప్పై సంవట్సరాలలో ఎన్నో సంఘటనలు చోటుచేసుకొన్నాయి. cఇవరకు నిజాం నవాబులు క్రీ. శ. 1753 లో ఫ్రెంచి వారికి సర్కారు ప్రాంతాన్ని ద్త్తం చేయ వలసి వచ్చింది. ఆ వెను వెంటనే ఇంగ్లీషువారు ఏర్పరచిన ఈSటు ఇండిఅయా కంపెనీ ఆ ప్రాంతాలను జయించి ఆక్రమించారు. ఇంగ్లీషు వారితో ఒప్పందం చేసుకొని నిజాం నవాబు రాయల సీమ ప్రాంతాన్ని ఇంగ్లీషు వారికి వప్పగించాడు. ఈ విధంగా ఆంధ్ర దేశంలోని రెండు ముఖ్య ప్రాంతాలూ ఆంగ్లేయుల వశం అయిపోయాయి.తెలంగాణా ప్రాంతం మాత్రం నవాబుల పాలనలోనే మిగిలి పోయింది.
క్రీ. శ. 19 వ శతాబ్దం ప్రారంభమయ్యే సమయానికి దాదాపు 1800 సంవత్సరం నాటికే బ్రిటిషు వారు ఆంధ్ర దేశాన్ని ఆక్రమించడం పూర్తి అయ్యి పోయింది.
బ్రిటిషు వారి పాలనలో ఆంధ్ర దేశం.
ఆంధ్ర దేశాన్ని వశం చేసుకోవడం కోసం బ్రిటీషువారు ఫ్రేంచివారితో నిజాం నవాబులతో మైసూరు సుల్తానులతో కూడా యుద్ధాలు చేయ వలసి వచ్చింది. క్రీ.శ. 1756 నుండి క్రీ.శ 1763 వరకు జరిగిన యుద్ధాలలో ఫ్రెన్చివారు ఓడిపోయారు ఏడేళ్ళ సుదీర్ఘ పోరాటం తరువాత గమ్జాం నుండి గుంటూరు వరకూ కోస్తా ఆంధ్ర ప్రాంతం బ్రిటీషు వారి వశం అయ్యింది. మొదట క్రీ.శ.1865 లో మొహ్ఘల్చక్రవర్తి జారీ చేసిన ఫర్మానా ద్వారానూ తరువాత క్రీ.శ. 1766 లో, 1768 లో నిజమ్ నవాబుతో జరిగిన ఒప్పాందాల ద్వారానూ ఫ్రెంచి వారి నుంచి గెలిచిన కోసతా ఆంధ్ర ప్రాంతం బ్రిటీషు వారికి చట్ట రీత్యా కూడా దఖలు పడింది. క్రీ.శ.1788 లో గుంటూరును స్వాధీన పరుచుకున్నారు మైసూరు సుల్తాను అధీనం లోని బళ్ళారి, అనంతపురం, కడప, కర్నూలు రాయలసీమ జిల్లాలను బ్రిటిషువారు, వారి స్నేహితుడైన నిజాం నవాబు మైసూరును తృతీయ చతుర్థ యుద్ధాల ద్వారా సంపాదించారు. అయినా వాటిని క్రీ.శ.1800లో బ్రిటిషు వారికి దత్తం చేశాడు. అంతకు మునుపు కర్ణాటక నవాబు పాలనలో ఉన్న చిత్తూరు నెల్లూరు జిల్లాలను బ్రిటీషువారు, 1802 లో కర్ణాటక నవాబు పదవీ చ్యుతితో స్వాధీనం చేసుకొన్నారు.
బ్రిటీషు వారిపై జమీందారుల తిరుగుబాటు.
ఆంద్ర ప్రాంతం మీద బ్రిటీషు వారు తమ ఆధిపత్యాన్ని సువ్యవస్థితం చేసుకోవడానికి చాలా సంవత్సరాలు పట్టింది. బ్రిటీషు ఆధిపత్యానికి వ్యతిరేకంగా రాజులు జమీందారులు
కప్పంకట్టే పాలి గార్లు ప్రతిఘటన సాగించారు. అప్పట్లో నిజానికి పాలనాధికారమంతా వాళ్ళ చేతులలోనే ఉండేది. పల్లకిమిడి, గుంటూరు, విజయనగరం, గంజాము లోని ప్రతాపగిరి కోటరాజులు క్రీ.శ. 1763 నుంచి తమ తిరుగుబాటు సాగిస్తూ వచ్చారు. వారిని అణచడానికి ప్రత్యేకంగా నియమింపబడిన స్పెషల్ కమీషనర్ జార్జ్ రస్సల్ రీ .శ.1837 లో వారిని, వారితో పాటు కలిసిన గిరిజన ప్రాంతం వారిని అణచడంతో చివరకు ఈ తిరుగుబాట్లు సమసి పోయాయి.
జమీందార్లలోకెల్ల శక్తిమంతుడైన వాడు విజయనగర రాజు. ఆతడు విశాఖపట్టణం జిల్లాలో ప్రతిఘటించాడు. కాని క్రీ.శ.1779 లో ప్రసిద్ధమైన పద్మనాభ యుద్ధంలోవ్ విజయనగరరాజు ఒడిపోయి చంపబడ్డాడు. తరువాత కూడా కాశీ పురం, వల్ల కొండ జమీందారులు ప్రతిఘటిస్తూనే ఉన్నారు.వీరందరినీ అణచడానికి 1836 వరకూ బ్రిటీషు వారు సతమతమవుతూనే ఉన్నారు. అలాగే రాయలసీమలోనూ చిత్తూరులోనూ పాలిగార్లను క్రీ.శ. 1806 లో అణచివేసి నంత వరకూ వారి నుంచి ప్రతిఘటనను బ్రిటీషువారు ఎదుర్కొంటూనే ఉన్నారు.
ఈ తిరుగుబాట్లను చరిత్రకారులు భారతీయుల వీరత్వ ప్రదర్శకాలుగా గుర్తించక స్వేదేశీ శక్తుల తిరుగుబాట్లు అని అభివర్ణించారు. బ్రిటీషువారికి అనుకూలంగా చరిత్ర తయారయ్యింది. ఇప్పుడు భారత దేశంలో ఉన్న భారతీయ చరిత్ర నిజమైనదికాదు.
భారతీయులకు చరిత్ర అంటే వీరి ఇతిహాస పురాణాదులే .కాని అవి కేవలం పఠనీయాంశాలే గాఅని చరిత్రకాదని బూటకపు చరిత్రను మన నెత్తిన రుద్ది చదివిస్తున్నారు.
స్వాతంత్ర్యం వచ్చినా మన చరిత్రను తయారు చేసుకోకుండా ఇంగ్లీషువారు తయారు చేయించిన చరిత్ర గ్రంథాలనే చదువుతున్నాం. ఇది కూడా ఆంగ్ల బానిసత్వమే అనక తప్పదు. ఇది సరైన దృక్పథం కాదు ఆ రోజుల్లో పరాయి దేశ పాలకులకు వ్యతిరేకంగా తమ తమ భూభాగాలను రక్షించుకోవడం కోసం చేసిన యుద్ధం దేశ ద్రోహం అనేది బ్రిటిషు వారి మనస్తత్వం. అదే భారతీయ చరిత్రగా రాసుకొంటే అది ఇంగ్లీషు చరిత్ర అవుతుందేకాని మన చరిత్ర కాదు.
ఇక పాలనాత్మకంగా ఎన్నో మార్పులు వచ్చాయి. స్వదేశీ పాలన ముగిసినట్లే. మళ్ళీ భారతస్వాతంత్ర్యోద్యమం వరకు ఉన్న భారతీయ పరిపాలనా గతమైన మార్పులు పరిశెలిద్దాం. తరువాత స్వాతంత్ర్య సమర శంఖారావం, ఆంద్ర రాష్ట్రావతరణం, మళ్ళీ ఆంధ్ర ప్రదేశ్ అవతరణలను గురించి చూద్దాం.
|
|
|