Home
Maagurimchi
Saahithyamu
Samskrithi
Devaalayaalu
Kalalu
Baala Saahithyamu
Charitra
Vaarthalu
Photo Gallery
 

బాలల సాహిత్యం

          బాలల సాహిత్యం ఆరంభించే ముందు తల్లిదండ్రులతో కొన్త ముచ్చటింపు

          మానవ జాతి మనుగడ ఉత్తమంగా ఉండాలంటే వారి ఆరోగ్య పరిరక్షణ అవసరం. తల్లి కడుపులో ఉన్న దశలోనే అవసరమైన ఆహారన్ని అందించడానికి ప్రయత్నించి తల్లి తనకు పుట్టబోయే బిడ్డ అందంగా ఉండాలని, తెలివితేటలతో ఉండాలనీ భావిస్తుంది. ఆరోగ్యంగా ఉండే బిడ్డ పుడితే ఆ తల్లిదండ్రులకు మానసిక దుఃఖం లేకుండా పెంచడానికి దోహద పడుతుంది. అలాగే తెలివితేటలు ఉండి ఉత్తమ భావాలతో పుట్టిన బిడ్డ వలన తల్లిదండ్రులకు అనందం కలుగుతుంది, అ బిడ్డ కూడా సుఖంగా ఉండడం జరుగుతుంది. అనారోగ్యం, అంగ వైకల్యం, మానసిక వైకల్యాలతొ పుట్టే బిడ్డలు ఆ తల్లిదండ్రులకు పుర్వ జన్మలోఉన్న శత్రువులే ఈరూపంలో పుట్టారని అనుకొంటూ ఉంటారు. "ఋణాను బంధ రూపేణ పశుపత్ని సుతాలయాః" అని ఆర్యోక్తి. అంటే మనకు వచ్చే భార్య, బిడ్డలు, సంపదలూ కూడా మనం వారికి ఋణం ఉన్నా,లేక వారు మనకు ఋణం ఉన్నా ఒకచోటికి చేరతం. కనుక వారికి మనం ఉన్న ఋణాన్ని తీర్చేంతవరకూ మనం వారి బాగోగులు చూసి వారి వలన వచ్చిన ఆనందంగాని, దుఃఖాన్నిగాని అనుభవిస్తూ ఉంటాం. అదే విధంగా వారు మనకు ఎంత ఋణం ఉంటారో అంత ఋణాన్ని తీర్చుకొనిన తరువాత ఒక్క క్షణం కూడా ఈ లోకంలో ఉండరు అని పెద్దలు చెబుతారు. కనుకనే భర్త కంటే చిన్న వాళ్ళయినా భార్య, లేక పిల్లలు ముందుగానే ఇల్లు విడిచి వెళ్ళి పోతారు. ఇది మనం లోకంలో అనుభవిస్తున్నదే.

          ఈ వేదంతాలు ఎలా ఉన్నా బిడ్డల సంరక్షణకు తల్లి కడుపులో ఉన్నప్పుడే కొన్ని జాగ్రత్తలు తీసుకొంటే ఉత్తమ సంతానం తప్పక కలుగుతుందనీ ఋణాలూ బాంధవ్యాలూ పక్కన పెట్టి,ప్రతి ఫలితానికీ కారణం మనమే అని అది ఈలోకంలోనిదే అని ఆధునికులు చెబుతూ ఉంటారు.

          ఏది ఏమయినా పురాణ సాహిత్యంలో కూడా సంతానం మంచిగ పుట్టిన వారిని గురించీ, చెడు బుద్ధులతో పుట్టిన వారిని గురించీ మనకు విశదంగా కనిపిస్తుంది.

          బిడ్డ కడుపులో ఉండగానే తల్లి దండ్రులు వ్యవహరించే విధానాన్ని బట్టి పిల్లలు పుడతారు.

          తల్లిదండ్రుల ప్రవర్తన ఇందుకు ముఖ్య కారణం. తల్లి దండ్రులలో ఆరోగ్య పరిరక్షణ వారి చేతులలోనే ఉంటుంది, అంతేకాక పుట్టబోయే పిల్లల ఆరోగ్యం, వారి తెలివితేటలూకూడా వారి చేతిలోనే ఉంటుంది. ఐడ్స్ ఉన్న తల్లిదండ్రులకు ఆ రోగముతోటే సంతానం కలుగుతుంది.

          వంశపారంపర్యంగా వచ్చే అనరోగ్యాలు థైరాయిడ్, రక్తపోటు, క్ష్యయ, వంటి రోగాలు ఉన్న తల్లి దండ్రుల పిల్లలు అవే రోగాలు కూడా తెచ్చుకొంటూ పుడతారు.కనుక తల్లి దండ్రులు తమ ఆరోగ్యాన్ని పరిరక్షించుకొంటూ ఆరోగ్య వంతమైన సంతానాన్ని కనడం తమకే కాదు సమాజానికీ, దేశానికీ కూడా ఎంతో అవసరం.

          తల్లి ఆరోగ్యంగానే కాదు తెలివిగానూ, కడుపులో బిడ్డ పెరుగుతున్నప్పుడు మంచి భావాలతోనూ కాలాన్ని గడపాలి. భక్తి సాహిత్యాన్ని చదువుతూ ఉండడం, నీతి కథలూ ఉత్తమ నాయకుల గాథలను వినడం వంటి మంచి అలవాట్ల వలన తల్లి కడుపులో పెరుగుతున్న బిడ్డ భావాలూ, ఆలోచనలూ ఉత్తమంగా ఉంటాయి అనేది నిరూపింపబడినదే.

          మహాభారతంలో ఉత్తంఅ నాయకుడైన అర్జునుడు తన భార్య అయిన సుభద్రాదేవికి యుద్ధ నీతినీ నైపుణ్యాన్ని తెలుపుతూ పద్మవ్యూహంలో ప్రవేసించడమ్ యుద్ధంలొ కావలసిన జాగ్రత్తలను విశదీకరించాడు. ఆ సమయంలో సుభద్రాదేవి నిద్రపోతున్నప్పటికీ ఆమె కడుపులో పెరుగుతున్న బాలుడు అయిన అభిమన్యుడు ఆ యుద్ధ విశేషాలను వింటూ తను వింటున్నట్లు "ఉ" కొడుతున్నాడని వ్యాస భగవానులవారు వర్ణించారు.

          నిన్నమొన్నటి జిజియా బాయి శివాజికి చిన్నప్పుడే శ్రీమద్రామాయణ మహాభారత కథలనూ పురాణాలలో ఉన్న వీర పురుషుల కథలనూ వినిపించి ఉత్తమ క్షత్రియునిగా తీర్చి దిద్దినదని చరిత్ర చెబుతోంది. గాంధీజీని కూడా ఇలాగే తల్లి పుతలీ బాయి, చిన్నతనంలో శిక్షణ ఇచ్చింది.

          ఇలాగ ఎన్నో కథలు ఉన్నాయి. కనుక బిడ్డలను కనే వారు వారి బిడ్డలను ఆరోగ్య వంతులుగానూ, తెలివైన వారిగానూ కనడానికి వారి అలవాట్లను సరయినవిగా చూచుకోవాలి అని మనవి.

          పిల్లలకు మంచి సాహిత్యాన్ని అందించే ప్రయత్నం చెయ్యాలి. చిన్నతనం నుండి బాలలచేత నీతి భక్తి సాహిత్యాన్ని, భక్తి సాహిత్యాన్ని చదివేలా చూడాలి. అందుకే ఈ వెబ్సైట్లో ఈ శీర్షిక ఉంచడం జరిగింది. తెలుగు శతక సాహిత్యాన్ని, కథాసాహిత్యాన్ని పిల్లలకు ఉపయోగించే రీతిలో అదిస్తున్నాం. బాలలచేత చదివించండి.

బాలలకోసం


          చిన్నతనం నుండే తల్లి తండ్రులు చెప్పినట్లుగా నడుచుకోవడం ముఖ్యం. స్నేహితులు చెప్పిన దానికంటే తల్లిదండ్రులు చెప్పిన విషయాలకు పాధాన్యం ఇవ్వాలి. "మాతృదేవో భవ, పితృదేవో భవ" అని మన ప్రాచీన గ్రంథాలు చెబుతున్నాయి. ఇవి సామాన్య వాక్యాలు కాదు తప్పక ఆచరించ వలసినవి. తల్లి దండ్రులు చదువుకోని వారయి కావలసినంత స్థాయిలో సలహాలు ఇవ్వలేని వారయితీ "ఆచార్య దేవో భవ" అనే ఆర్య వాచకాన్ని గుర్తించాలి. తల్లి దండ్రులను ఎంత నమ్ముతామో అంతగా ఆచార్యునికూడా నమ్మాలి, వారి సలహాలను పాటించాలేగాని స్నేహితుల సలహాలను పాటించకూడదు.

          చిన్న తనంలో భక్తికి సంబంధించిన పుస్తకాలను చదవడం అలవాటు చేసుకోవాలి. మన తెలుగు వాఙ్మయంలో బాలలకోసం ఎంతో సాహిత్యం ఉంది. ఆ సాహిత్యాన్ని అందించడం బాలల బంగారు భవిష్యత్తును తీర్చి దిద్దడానికి చేసే ఒక చిన్న ప్రయత్నమే ఇది.

అమృతవాక్కుల శేషకుమార్ సమర్పణ.