Home
Maagurimchi
Saahithyamu
Samskrithi
Devaalayaalu
Kalalu
Baala Saahithyamu
Charitra
Vaarthalu
Photo Gallery

 
1.విద్య
2.కుచేలుని కథ?
3.పరశురామావతారం
4.శ్రీవేంకటేశ్వర రూపవర్ణనము
5.పరమాత్ముని అవతారాలు
back to top

1.విద్య

విద్య అంటే తెలుసుకోతగినది అని అర్థం. ఇది పూర్వం వేద విద్య ఆధ్యాత్మ విద్య అని మాత్రమే అర్థాన్ని కలిగి ఉండిది . విద్య అనేది కేవలం పరోపకారపరమైనది సాంఘిక సంక్షేమానికి ఉపయోగించేది అని మాత్రమే అర్థాలలో వాడబడేది కాని ఈనాడు డబ్బు సంపాదించడానికి ఉపయోగించే విద్యలన్నీ విద్యలుగా చెప్పబడుతున్నాయి. ఇది సరియైనది కాదు. రఘుకులంలోని రాజులందరూ ధనుర్వద్యాదులన్నీ వారికోసం కాక జనరక్షణకోసం మాత్రమే నేర్చుకొనేవారు అని చాలాచోట్ల వ్రాయబడి ఉంది.
విద్యార్థిఅంటే- విద్యను అర్థించేవాడు అని మాత్రమే అర్థం కాని కాపీలుచేసి పరీక్షలు పాసయ్యే వాడుకాదు.
విద్యార్జన మూడు విధాలుగా మాత్రమే చేస్తారు అని పూర్వం చెప్పేవారు.
“గురుసుశ్రూషయా విద్యా పుష్కలేన ధనేన వా
అథవా విద్యయా విద్యా చతుర్థో నోపలభ్యతే” అని
కనుక గురుసుశ్రూష చే్సి విద్యను గ్రహిచాలి లేక రాజుల వలె బాగా ధనం ఇచ్చి చదువుకోవాలి లేక చివరిగా ఒక విద్యను ఇచ్చి మరొక విద్యను నేర్చుకోవాలి నాల్గవరకంగా విద్యను పొందరాదు. ఈ వివిధ విషయాలలో రెండవ రకాన్ని మాత్రమే ఇప్పుడు ఉపయోగిస్తున్నవారు కొందరు. ఇలా కాని కర్ణుడు అబద్ధం చెప్పి పరశురామునిదగ్గర విద్యను గ్రహించి కూడా నష్టపోయాడు. ఏకలవ్యుడు ఆచార్యుని ఆశీస్సులు లేక విద్యను పోగొట్టుకొన్ేనాడు. అనేవి మనకు సాహిత్యంలో కనిపించే అనేక ఉదాహరణలలో ఒకటి రెండుగా కనిపిస్తాయి.
back to top

2.కుచేలుని కథ

సత్త్వగుణాన్ని కూడా పరమాత్మకు అర్పించాలి అనేది గ్రాహ్యం .
కుచేలుడనే పేద బ్రాహ్మణ విద్యార్థి బాలకృష్ణ బలరాములతో సాందీపనీ మహర్ష్ దగ్గర విద్యనభ్య సించాడు. ఐతే పెద్ద అయినతరువాత శ్రీ కృష్ణుడు మధురానగరానికి రాజయ్యాడు. అదే నగరంలో కుచేలుడు దేవాలయంలో పురాణకాలక్షేపంచేస్తూ కాలం వెళ్ళ దీస్తున్నాడు. అధిక సంతానంతో బాధపడుతువ్నాడు. కుచేలుడు కనీసం కూడు గుడ్డ నీడలేని కటికదారిద్ర్యాన్ని అనుభవిస్తున్నాడు. భార్యా బిడ్డలను పోషించుకోవడం కూడా అతనికి కష్టంగా ఉండేది. ఒకనాడు కుచేలుని భార్య కుచేలుని రాజయన బాల్య స్నేహితుడైన శ్రీ కృష్ణునిదగ్గరకు వెళ్లి తన పేదరికాన్ని గురించి తెలుపవలసినదిగా కోరింది. కుచేలుడు సంకోచించాడు. రాజు అయిన తన మిత్రుడు తనను గుర్తు పడతాడో లేదో అని కలవరపడ్డాడు కనీసం పెద్దవాడు గౌరవనీయుడు అయిన రాజు దగ్గరకు వెల్లినపుడు ఏదైనా బహుమతి తీసుకుని వెళ్ళకుండా ఎలాగా అని ఆలోచించాడు. చాలా జాగు చేసాడు. ఐనా భార్య పోరుతూనే ఉంది. చివరకు బార్య మాటకాదనలేక కుచేలుడు బయలుదేరాడు. భార్య ఇంట ఉన్న పాత అటుకులు కొన్ని ఇచ్చింది. ఆమూట పట్టుకొని కుచేలుడుమధురానగరానికి వెళ్ళాడు. శ్రీ కృష్ణుడు కుచేలుని దూరంనుండే చూచి ఆహ్వానించాడు కుచేలుడు ఆశ్యర్యపోయాడు. రాజమందిరంలోకి తీసుకొనివెళ్ళి నమో బ్రహ్మణ్య దేవాయ స్వస్తి మేస్తు అని అంటూ బార్యలచేత కూడా సపర్యలు చే.యించాడు. బాల్య మిత్రుడు ఏదో బహుమతి తెచ్చాడే అని సంతోషంతో ఆతృతతోనూ అటుకులమూట విప్పుకొని ఒక గుప్పెడు అటుకులు తిన్నాడు. మళ్లీ రెండవగుప్పెడు తీసుకొంటూ ఉండగా రుక్మిణీదేవి అడ్డుకొంది. శ్రీకృష్ణుడు కుచేలునికి చేతితో ఏమీ ఇవ్వకనే మిత్రుని సాగనంపాడు. కుచేలుడు ఎంతమాత్రమూ బాధపడలేదు. ఇంటిదారిలో వెడుతూ అతడు తన ఇంటిమార్గాన్ని మరిచిపోయాడని ఏదో ధ్యాసలో దారితప్పాడని అనుకొంటూ ఉండగా రాజభటులు వచ్చి తన ఇంటికి ఆహ్వానించారు. కుచేలుడు నివ్వెరపోయాడు. తిరిగి చూస్తే పిల్లలు బార్య రాజ దుస్తులతో మెరిసిపోతున్నారు. కుచేలుడు పరమానందభరితుడయ్యాడు శ్రీకృష్ణుని మహిమను తలపోసాడు.
ఈ కథలో సత్త్వగుణాన్ని కూడా పరమాత్మకు అర్పించాలని బోధిస్తున్నాడు.అదెలాగో చూద్దాం కుచేలుడు అంటే చరిగిపోయిన గుడ్డలుకలవాడు అని అర్థంకదా. గుడ్డలు చిరిగిపోతే శరీరంకనిపిస్తుంది. అలాగే ఆత్మనుఆవరించిన గుడ్డలు మూడు పొరలుగా ఉంటాయి. అవి సత్త్వగుణం రజో గుణం తమోగుణం. వీటిలో కుచేలుడుకి తమోగుణం లేదు. రజో గుణం కూడా లేదు. ఇక సత్త్వ గుణం మాత్రం ఉంది అది మాత్రమే ఉన్నపుడు అతడికి బుద్ధి పరిపక్వత చెందుతుంది. అదే తనతో ఉన్న భార్య ఆత్మ దర్శనం చేయమనడం. అంటే శ్రీ కృష్ణదర్శనానికి వెళ్శమని చెప్పడం అని కథలో వివరించారు. జీవుడు ఇప్పుడు పరమాత్మ దర్శనం చేయడానికి ఏమి సమర్పించాలి అని ఆలోచించాడు. అప్పుడు తనదగ్గర ఉన్న సత్త్వ గుణాన్ని సమర్పించాలని తనలోని బుద్ధి అనే భార్య చెప్పింది . సత్త్వ గుణం అంటే అటుకులు అని తెలుసుకోవాలి. అంటే వాటిలో ఇతరులకు బాధ కల్పించే తమో గుణం గాని మొలకెత్తే రజో గుణం గాని లేని సత్త్వగుణం అని తెలుసుకోవాలి. ఆ సత్త్వ గుణాన్ని పరమాత్మకు అర్పణ చేయడానికి మధురా పురికి వెళ్ళాడు. అంటే తీయనైన పరమాత్మ దర్శన పురి అన అర్థం. అక్కడ సుఖం తప్ప మరేమీ ఉండదు. అంటే మధురమేకదా.
ఆత్మదర్శనం కోసం మధురా పురికి వెళ్ళిన వాడికి పరమాత్మ స్వయంగా స్వాగతం చెప్పాడు. అంటే శుద్ధ సత్త్వ గుణం కలవాడు పరమాత్మ దర్శనం చేయ. గలుగుతాడు అని తెలిసిపోయింది. పైగా పరమాత్మ స్వయంగా ఆహ్వానిస్తాడు. అందుకే శ్రీ కృష్ణుడు స్వయంగా వచ్చి కుచేలుని ఆహ్వానించి తీసుకొని వెళ్లాడు అని కథలో చెప్పారు. అక్కడ తన సత్త్వ గుణాన్ని కూడా సమర్పించాడు. అంటే అటుకులు సత్త్వగుణానికి ప్రతీక అని చెప్పుకున్నాం కదా. సత్త్వ గుణాన్ని తీసుకొనే శ్రీ కృష్ణుడు కొంత తీసుకోగానే ఆతని శక్తి అయిన రుక్మిణీ దేవి రెండవమాటు అటుకులు గ్రహించవద్దని చెప్పింది.
ఎందుకు?
అలా తీసుకొంటే పరమాత్మ కుచేలునికి ఇప్పుడే మోక్షాన్ని ఇవ్వాలి కాని కుచేలుడు పూర్వ జన్మకృతమైన పాపానికి సంబంధించిన అపూర్వాన్ని ఇప్పటివరకు అనుభవించాడు కాని అతని పూర్వ జన్మ కృతమైన పుణ్యానికి సంబంధించిన అపూర్వాన్ని అనుభవించవలసి ఉంది. కనుక అదికూడా అనుభవించాక మోక్షం ఇవ్వాలేగాన అంతకు ముందు ఇవ్వకూడదు కనుక రుక్మిణీ దేవి అడ్డు చెప్పిందేగాని తన స్వార్థంవలన కాదు. అందుకే కుచేలుడు ఇంటికి పోయినప్పుడు కృష్ణుడు సత్త్వ గుణమైన అటుకులను గ్రహించాడేకాని తిరిగి అతనికి రాగి పైసాకూడా ఇవ్వలేదు. ఐనా కుచేలుడు తన ఇంటికి వెళ్ళేటప్పటికి ఆవీధి మరిచి పోయి మార్గం మారిపోయాడన్నంత భ్రమ పడేలాగ ఇల్లు పిల్లలు మారిపోయి ఒక్కమాటుగా సంపదలతో తులతూగుతూ నౌకర్లు చాకర్లు ఎదురు వచ్చి కుచేలుని స్వగృహానికి తీసుకొని వెళ్ళారు.
వచ్చేది రాకమానదు. పూర్వ జన్మ సుకృతం అనేది అనుభవింపక తప్పదు.
కుచేలుడు సత్త్వ గుణాన్ని కూడా విడుచుకున్నాక అతనికి సంపదలు వచ్చాయి. ఎవరైనా సరే తమ తమోగుణాన్ని రజో గుణాన్ని వదులుకొని సత్త్వ గుణాన్నికూడా విడుచుకొంటే తమ భాగ్యం వలన ఉన్నతులు గానూ సంపన్నులుగానూ అవుతారు అన్నది భాగవతంలో కుచేలోపాఖ్యానంలో తేట తెల్లమయింది.
కనుక అందరూ కుచేలులు కావాలి. అంటే గుడ్డలు చిరిగినవారుకాదు. గుణ విరహితులు కావాలి . పరమాత్మ దర్శనకాంక్షులుకావాలి. అప్పుడే భాగ్యం చేకూరుతుంది.
పాప పుణ్యాల అనుభవం అయ్యాక మోక్షకూడా లభిస్తుంది. అని ఈ కథవలన తెలుస్తోంది.
back to top

పరశురామావతారం


 లీలా మానుష విగ్రహుడయిన ఆ పరమాత్ముడు తన లీలా వినోదాల్లో తల్లిని చంపమంటే పిత్రాజ్ఞాపరిపాలనా దక్షుడయిన ఆదర్శప్రాయుడు . ఆయన ఏరూపంలో అకార్యం చేస్తారో తెలియని పరమ కపటనాటక సూత్రధారి అయి పరశురామావతారంలో ఏవిధంగా వర్ణింపబడ్డారో పోతన భాగవతశైలిలో చూద్దాం.
భాగవతం లోని తొమ్మిదవ స్కంధంలో –
సీ || హైహయాధీశ్వరుండర్జునుండనువాడు ధరణీశ్వరులలోన దగినవాడు
      పురుషోత్తమాంశాంశు బుణ్యు దత్తాత్రేయు పరిపంథి జయమును
      బాహుసహస్రంబు నణి్మాది గుణములు యశము బలము
       యోగీశ్వరత్వంబునోజయు దేజంబు జెడని యింద్రియములు సిరియు బడసు
గీ|| గాలికైవడి సకల లోకంబులందు
     దనకు పోరాని రారాని తలము లేక
     యెట్టిచోనైన దన యాజ్ఞ యేపు మిగుల
     ధరణి వెలుగొంద వినువీథి దరణి మాడ్కి.                                                           (9.430)
సీ|| ధరణీశుడొకనాడు దైవయోగంబున వేటకై కాంతారవీథి కేగి
     తిరిగి వేటల శ్రాంత దేహుడై జమదగ్ని ముని యాశ్రమము జేరి మ్రొక్కి నిలువ
     నామునీంద్రుడు రాజునర్థితో బూజించి యా రాజుకు రాజు సనుచరులకు
     దన హోమధేనువుదడయక రప్పించి యిష్టాన్నములు గురియింప నతడు
తే.గీ|| గుడిచి కూర్చుండి మొదవు పై గోర్కి జేసి
      సంపదేటికి నీయావు చాలు గాక
      యిట్టి గోవుల నెన్నడు నెఱుగమనుచు
       బట్టి తెండని తన యొద్ది భటుల బనిచె.                                                              (9-437)
అంతట రాజ భటులు ఆ హోమధేనువును బలవంతంగా తీసుకొనిపోగా ఏది తెలసి కొని జమదగ్ని కుమారుడయిన పరశురాముడు క్రోధించి
మ || ప్రళయాగ్ని చ్ఛట భంగి గుంభి విదళింపన బాఱు సింహాకృతిన్
        బెలుచనం రాముడిలేశు వెంట నడచెన్ బృధ్వీతలంబెల్ల నా
        కులమై గ్రుంగ గుఠారియై కవచియై కోదండియై కాండియై
        ఛలియై సాహసియై మృగాజినమనోజ్ఞ శ్రోణియై తూణియై.                                     (9- 443) యుద్ధానికి బయలు దేరాడు. అతనిని చూచి క్రోధించిన సహస్రబాహు అర్జునుడు
ఉ|| బాలుడు వెఱ్ఱి బ్రాహ్మణుడు బ్రాహ్మణుకైవడి నుంట మాని భూ
       పాలురతోడ భూరి బలభవ్యులతోడ భయంబు దక్కి క
       య్యాలకు వచ్చినాడు మన యందిక బాపము లేదు లెండు లెం
       డేల సహిప భూసురుని నేయుడు వ్రేయుడు గూల్చు డిమ్మహిన్.                         (9-447) అంటాడు . ఇంకా అతని శౌర్యం గాంచి పలుకుతాడు.
మ|| ఒకయేనూరు కరంబులన్ ధనువు లత్యుల్లాసి యై తాల్చి నే
       ఱొకయేనూటగుణ ధ్వనుల్ నిగుడ శాతో గ్రాస్త్రముల్ గుర్చి వి
      ప్ర కఠారమును నిన్ను గూల్తుననుచున్ భర్జించి పుంఖానుపుం
      ఖ కఠోరంబుగ నేసె రాజు రయరేఖా ధామునిన్ రామునిన్.                                     (9-453)
మ|| ధరణీ దేవుడు రాముడాఢ్యుడు జగద్దానుష్కరత్నంబు దు
       ష్కరచాపం బొక టెక్కువెట్టి శరమున్ సంధించి వెల్లేసి భూ
       వరు కోదండములొక్క చూడ్కి దునిమెన్ వాడంతటం బోక వే
       తరువుల్ ఱువ్వగుఠార ధార నఱకెన్ దద్బాహుసందోహమున్.                            (9.456)
క||   కరములు దునిసిన నతనికి
       శరమొక్కటి చిక్క శైలశిఖరము భంగిం
       బరశువున నదియ ద్రుంచెను
       బరసూదనుడైనఘనుడు భార్గవుడు వడిన్.                                                          (9.457)
తన ఆవును తాను విడిపించుకొని ఇంటికి తీసుకొని వెళ్ళాడు. పరశురామునితండ్రి అయిన జమదగ్ని ఆశ్రమంలోనే ఉన్నారు. రాముని తల్లి రేణుకా దేవి జలాహరణంకోసే నదికి వెళ్ళి ఆలస్యంగా వచ్చింది. ఆమె అక్కడ అప్సరో మిధునాన్ని చూస్తూ కాలయాపన చేసిందినే కోపంతో తండ్రి తల్లి కి మరణ దడన విధించాడు. తల్లిని చంపమని పుత్రులను ఆదేశించాడు. కాని కుమారులెవరూ మారు పలుకలేదు. దానితో ఆగ్రహించిన భర్గ మహర్షి పరశురాముని పిలచి తల్లిని తనమాట వినని కుమారులను చంపమని ఆజ్ఞాపించాడు. పరశురాముడు
శా|| తల్లిన్ భ్రాతల నెల్ల జంపుమనుచో దా జంపి రాకున్న బెం
      పెల్లన్ బోవ శపించు దండ్రి తన పంపే జేయుడున్ మెచ్చి నా
      తల్లిన్ భ్రాతల నిచ్చు నిక్కము తపో ధన్యాత్మకుండంచు వే
      తల్లిన్ భ్రాతల జంపె భార్గవుడు లేదా చంప జేయాడునే ?                                        (9.471)
అంతట పుత్రుని క్రియకు తండ్రి సతసించాడు.
కం|| మెచ్చిన తండ్రిని గొని
       చెచ్చెర నీ పడిన వారి జీవంబులు నీ
       విచ్చితి ననుమని మ్రొక్కిన
       నిచ్చెన్ వారలును లేచి రెప్పటి భంగిన్.                                                     (9.474) పరశురాముడు ఇంట లేని సమయంలో అర్జునుని కుమారులు హైహయులు తన తండ్రిని చంపినవాడు పరశురాముడని తెలుసుకొని ఆతనిపై యుద్దానికై ఆశ్రమానికి వచ్చారు.
తే.గీ||నిరుపమ ధ్యాన సుఖ వృత్తి నిలిచి యున్న
       పుణ్యు జమదగ్ని నందరు బొదివి పట్టి
       కదలకుండగ దల ద్రెంచి కొనుచు జనిరి
       యడ్డమేతెంచి రేణుక యడచి కొనగ.                                                           (9.477)
ఈ విషయాన్ని తెలుసుకొన్న పరశురాముడు
కం || ఖండించి రిపుల శిరములు
        గొండెలుగా బ్రోగులిడియె గురు రక్తనదుల్
        నిండికొని పాఱి యుబ్బెను
        భండనమున నృపులు రిపులు భయమంద నృపా||                                     (9.485)
ఆ|| అయ్యపగకు రాముడలయ రాజు ల
      నురువదొక్కమాఱు లరసి చంపె
       జగతి మీద రాజశబ్దంబు లేకుండ
       సూడు దీర్పలేని సుతుడు సుతుడె                                                (9.486)
ఇలా తడ్రిని తెగటార్చిన వారిపై పగ తీర్చుకున్నాడు. క్షత్రియులను 21 మారులు మట్టు పెట్టాడు. ఇందు పోతనగారి భాగవతంలోని పరశురామ అవతారఘట్టం సంక్షిప్తంగా చెప్పబడింది. ఈ అవతారంలో తండ్రి తనయుని మాతృహననానికి ఆజ్ఞాపించడం దానిని శిరసావహించడం పుత్రుడు మాతృ శిరఃఖండనం చేయడం విశేషకార్యం ఈకథలోని అంతరార్థం గమనిద్దాం.

ఆధ్యాత్మ యోగం.

             ఏ కుమారుడు తన తల్లిని స్వయంగా చంపమంటే చంపలేడు. ఐనా ఆవతారం ఎత్తిన పరశురాముడు దేనికి అవతరించాడు. మాతృహత్య కోసమా? హైహయుడు కామధేనువును ఎత్తుకు పోతే వానిని సంహరించడం ఈ అవితార లాభం. అది నెరవేరి పోయింది. ఆ తరునాత ఇంకా అవతారం పొడిగింప చేసిన ఘనకార్యం ఏమంటే, రాజులను 21 సార్లు మట్టు పట్టడం. నిజంగా ఒకమాటు రజులందరినీ నాశనం చేస్తే తిరిగి అన్ని మాట్లు చంపవలసిన అవసరం ఎందుకు వచ్చింది. క్షత్రియ వంశాలు అన్నీ నాశనం అయ్యాక తిరిగి ఎలా పుడుతాయి. కౌరవులు గర్భస్థపిండం అయిన పరీక్షిత్తును కూడ చంపాలని అనుకొన్నారే, అలాంటిది పరమాత్మయే స్వయంగా చంపఋని అన్ని మార్లు చంపవలసి వచ్చింది. శ్రీరాముడు ఒక్క గడ్డి పరకతో బ్రహ్మాస్త్ర ప్రయాగం చేశాడే, అలాగే పరమాత్మ అయిన పరశురాముడు క్షత్రియ నాశానానికి అంత శ్రమ ఎందుకు పడవలసి వచ్చింది. మొదలైన ప్రశ్నలెన్నో తలెత్తినపుడు ఈకథలోని అంతరార్థాన్ని గమనించినపుడే కథా భాగంయొక్క సంపూర్ణార్థం వెలువడుతుంది. అది శంకరుల వారు తమ ఆత్మబోధ గ్రంథంలో
                “సమ్యక్కలిజ్ఞానవాన్ యోగీ స్వాత్మన్యేవాఖిలం జగత్
                  ఏకం చ సర్వమాత్మాన మీక్షతే జ్ఞానచక్షుషా”
అని శెలవిచ్చారు. అంటే అఖిలజగత్తును జ్ఞాన చక్షువుతో తనలోనేచూడగలిగిన వారు మాత్రమే సమ్యక్ కలిఙ్ఞానవాన్ , యోగీ అని అంటారు. అంటే ఈ కథలలోని సర్వస్వాన్ని తమలోనే చూడగల్గిన వాడే ఆత్నఙ్ఞాన యోగి కనుక ఈ అర్థం తప్పక తెలుసుకొని ఉండాలి అని వివరిస్తున్నాను.
        పరశురాముడు అవతార పురుషుడైన పరమాత్మ. జమదగ్ని కుమారుడు. జమత్ + అగ్ని అంటే పుట్టిన వానిని అంటిపెట్టుకొని ఇండేవాడు అని అర్థం- జాయతే ఇతి= జః.తేన సహవర్తతే ఇతి = జమత్, అని సంస్కృతంలో వ్యుత్పత్యర్థం. ఈ లోకంలో పుట్టే వానితో కూడి ఉండే వాసనా రూపం జమత్. అట్టిజమత్ అగ్రిగ గలవాడు.
         అగ్ని అగ్రి శబ్దాలు సమానార్థకాలుఅని భారతీ నిరుక్తి అనే గ్రంథంలో హరిసోదరులు ఇచ్చిన వివిరణం. అగ్రి అగ్రత్వం ఏ వస్తువునకూ ఉండదు. అగ్రమనేది ఒకవైవునుండు అదిగానూ ఉంటుంది. అంటే ఆది ఆనాది అనంతం కూడ. అద్యంతములు లేనిది, కానిది అయిన పరమాత్మకే అగ్ని శబ్దార్థం చెప్పుకోవాలి. కనుక పుట్టిన జీవునితో కూడిఉన్న వాసనలు, అనాద్యానంత పరమాత్మ భావనతో ఉండడం వలన, జమదగ్ని పరమాత్మ నెరిగిన జీవుడు. అట్టి వాని దగ్గర పరమాత్మానందం రేణు రూప పరమాణువుగ ఉంటుంది. కనుకనే జమదగ్నితో భార్య రేణుక ఉన్నదనే చప్పబడింది. వాసనా వాసితునేగ, జీవునిగ ఉన్న పురుషుడు పరమాత్మ.
        సహస్రబాహువయిన కార్తవీర్యార్జునుడు సుప్రతిష్టితమైన శక్తిగల జీవుడు. వూర్వజన్మ సుకృతం వలన ఋజువర్తనుడు,అర్జనుడు అనే శబ్దం ఋజుప్రవర్తన కలవానికి, స్వచ్ఛమైన భావం కలవానికి , అమలిన మనస్కునికి పేరు. కృత వీర్యం యస్యసః కార్తవీర్యః నిర్వర్తింపబడిన వాసనా బలంకలవాడు అని అర్థం. నాధకునిలోని భగవంతుని కోసం అన్వేషణ చేసి ఋజువర్తనాన్ని ప్రయత్న శీలాన్ని కార్తవీర్యార్జునునిగ చెపుతాము. కాని ఈతనికి సహస్ర బాహువులు ఉన్నాయి. బాహువులు రెండు కనుక ఇవి జయాపజయాలు,లాభా లాభాలు,రాగద్వేషాలు, సుఖదుఃఖాలు మొదలైన ద్వంద్వాలు సహస్రంగా ఉన్నాయి అని అర్థం. ఈ ద్వంద్వ భావాలు ఈ ద్వంద్వ శరీరంలోనే ఉన్నాయి.
          పరమాత్మను చేరాలనే కోరికతో వాసనావాసిత జీవుడు అయిన జమదగ్ని దగ్గర ఉన్న ప్రకామ్యసిద్ధి కామధేనువు. దానిని ద్వంద్వ యుతుడయిన అర్జునుడు గ్రహించాలని కోరాడు. సాధకునిలోని భగవదన్వేషణ రూప ఋజువర్తనం ప్రకామ్య సిద్ధిని గ్రహించాలనికోరి బలవంతంగా గ్రహించింది. ఐతే సాధకునిలోని సుగతిని చేర్చే ఉత్తమమైన ఆనందస్వరూపం=పరమాత్మ స్వరూపం- ఆ పరశురామ రూపం. ద్వంద్వ భావనాయుతమైన అర్జున రూపాన్ని నశింప చేసి, కేవల వాసనా జనిత పరమాత్మా కాంక్ష కల స్థతికి-జమదగ్నికి- ఆ ప్రకామ్యసిద్ధిని చేర్చింది. దీనినే పరశురాముడు కార్తవీర్యార్జున సంహారంచేసి జమదగ్నికి హోమధేనువును అందించాడని చప్పారు.
          అందుచేత పరమాత్మానందాభిలాషి అయిన జమదగ్ని రూపానికి ప్రతిదానికినీ ప్రకామ్య సిద్ధి లభిస్తుంది.
          రేణుక ప్రకృతి. ప్రకృతి-బాహ్య ప్రపంచాసక్త అయితే పరమాత్మానందాను భూతిని కోరే జమదగ్ని ఆ ప్రకృతినే విడువను యత్నిస్తాడు. ప్రకృష్ఠమైన మంచి ఆనందాను భూతి ఆ ప్రకృతిని ధ్వంసం చేస్తుంది. ఐతే రేణుకా ప్రకృతి తామసిక ప్రకృతి కాకపోవడం చేతనూ, సాత్త్విక ప్రకృతి ఒకప్పుడు ఐహికానందాసక్త అయినా తిరిగి పరనాత్మానందానురక్త అవుతోందనేది నిరూపించడానేకే, తిరిగి రేణుక బ్రతికిందని చెపుతారు. కనుక పరమాత్మానందానుభూతినే జీవిలోనే ఐహిక ప్రకృతి సానుభూతినే నాశనం చేసినా అది సాత్త్విక గుణోపేతం అయితే పునరుత్పత్తి కాగలదనే నిరూపింపబడింది.
          అర్జునుని కుమారులుజమదగ్నిని చంపారు. దాంతే కోపగించిన పరశురాముడు రాజువంశాలను ముయ్యేడుమూర్లు నాశనం చేశాడుట. అంటే ఇందులో చక్కటి చిక్కటి అంతరార్థం నిబిడీకృతమై ఉంది. దాన్మి తెలుసుకొంటే పరశురామానందం కలుగుతుంది. శ్రేష్ఠమైన ముక్తికి సంబంధించినఆనందరూప బ్రహ్మ పరశు రాముడు. అట్టివాని ఉత్పత్తి సాధకునిలోని సప్తధాతువులునూ సత్వ రజస్ ,తమో గుణభూయిష్ఠములయి ఉన్నవాటిని ఇరవై ఒక్కటినీ నాశనం చేస్తాడు. అని అంతరార్థం.
          ప్రతి సాధకునిలోనూ ఈ సప్త ధాతువులు ఉంటాయి. అవి చీము,నెత్తురు,మాంసం,క్రొవ్వు, ఎముక,మూలుగు, శుక్రం అనేవి. ఈ సప్తధాతువులే శరీరాన్ని నిలిపి ఉంచేవి. అయితే ఈ ఏడింటికి సత్త్వగుణం,రజోగుణం,తమోగుణం అనే నూడు గుణాలూ ఉంటాయి. ఈ గుణాలలో ఏదో ఒకటి కొందరిలో ఎక్కువగను కొదరిలో తక్కువగను ఉంటాయి. అంతేగాని ఈ గుణరహితంగాగాని ధాతురహితంగానీ ఉండరు. అటువంటపుడు ఆ సప్త ధాతువులూ ఈ గుణత్రయంతో గుణితములయి ఉంటాయి. అవిఅన్నీ కూడ ఈ శ్రేష్టముక్తి ,బంధ ఆనంద రూపశక్తిని నశింపచేసే నిర్గుణ నిర్థాతువుగా, ఈ జీవుని చేస్తుంది. దాంతో ఈ జీవునికి ముక్తి సంప్రాప్తిస్తుంది.
        కనుక ముక్తి కావాలంటే ఈ 21 ధాతువులనూ నశింపచెయ్యాలి. అది కేవలమూ శ్రేష్ఠముక్తి సంబంధ ఆనందరూప పరబ్రహ్మ వలన మాత్రమే సాధ్యమని ప్రతి సాధకుడు పరశురామ సాధనచెయ్యాలి ఈ అంతరార్థం తెలిసిన తరువాత
దోహా!!
            తేరా సాయీ తుజ్ఝ మే జ్యోం పుహుపన్ మే బాస్
           కస్తూరీ కా మిరగ్ జ్యోం ఫిర్ ఫిర్ ఢూండై ఘాస్
అనే కబీర్ సూక్తి సంపూర్ణంగ నిజమని తెలుస్తుంది.
          ఈ జ్ఞానాన్నే ప్రజ్ఞానం అంటారు. మిగిలినవి జ్ఞానాలు మాత్రమే. వేదవిహిత జ్ఞానం కాక మిగిలినవి-అజ్ఞానాలు అని తెలియాలి. అందుకే భగవద్గీతలో భగవానుడు అర్జునునికి
          శ్లో!! ఆధ్యాత్మజ్ఞాననిత్యత్వం తత్త్వ జ్ఞానార్థ దర్శనం!
                 ఏతద్ జ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యదతో న్యథా!!
అని చెప్తారు.
          ఆధ్యాత్మ జ్ఞానం తత్త్వజ్ఞన దర్శనం వలన లభిస్తుంది. అది నిత్యమైన జ్ఞానం. ఇదే జ్ఞానం అంటే. మిగిలినవి అజ్ఞానములనే చెప్పబడతాయి.
           కనుక అధ్యాత్మయోగ జ్ఞానాన్ని వంటబట్టించి కొన్న పురుషుడు నిజంగా ముక్తిని పొందుతాడు అన్నది నగ్నసత్యం. ఇది పరశురామావతారం అంతరార్థం .

back to top

శ్రీవేంకటేశ్వర రూపవర్ణనము


            మహావిష్ణువు యొక్క కలియుగఅవతారమైన వేంకటేశ్వరుడు కటివరద హస్తునిగ ఉండడం ఒక విశేషం. ఈయన కుడి చేతితో పాదాలను చూపుతూ ఉన్నారు. ఈ హస్తాన్నే వరద హస్తంగ కూడ చెపుతారు. ఇలా పాదాలను చూపు హస్తముద్ర వలన భక్తులకు సూచనయిస్తున్నారు.-భక్తులారా! నా పాదములను అనన్య చింతనతో ఆశ్రయింపుడు అని. దాని వలన కలిగే ఫలితాన్ని రెండవ చేత్తో చూపుతున్నారు. నన్నాశ్రయించేభక్తునికి ఈ భవసాగరము మోకాటిలోతు మాత్రమే ఉంటుంది. ఇలాంటి ముద్ర మరి ఏ దేవునికిని లేదు. ఈయన విశేషాయుధాలను ధరించడం లేదు. ఊర్థ్వపుండ్రాలను మాత్రము విపులంగ ధరిస్తాడు. ఈయన చుబుకమున (గడ్డము) తెల్లని మచ్చ ఉంటుంది. ఇది కూడ ఈయనకు మాత్రమే ఉన్న ప్రత్యేక లక్షణం. ఈ మచ్చకు ఒక ప్రత్యేక కథ ఉంది.
          

స్వామి గడ్డమున ఉన్న తెల్లని మచ్చ


        వేంకటేశ్వరభక్తులలో అనంతాళ్వారులని ఉన్నారు ఆయన స్వాముని రోజూ సేవించుకొనేవాడు. వారికి సంతానము లేదనే బాధ అధికంగ ఉండేది. స్వామి వారిని తనకుసంతానమును ప్రసాదంచమని కోరారు. శ్రీస్వామివారు అనంతాళ్వారులతో చెప్పాడు-ప్రతిరోడుపాతాళ గంగనుండి నీటిని తెచ్చి స్వామి వారికి అభిషేకం చెయ్యమని. ఈరోజునుండి అనంతాళ్వారులునిత్యం పాతాళ గంగనుండి జలం తెచ్చి అఙషకం చేస్తుకన్నాడు. భార్యాభర్తలు ఈ కార్యనిమగ్నులు అవడం వలన స్వావుకి కూడ సంతోషం కలిగింది. అనంతాళ్వారుని భార్య గర్భవతి అయింది. భార్యాభర్తలు ఇరువురూ నిత్యం పాతాళ జలా హరణము చేసి స్యామికి అభషకం చేస్తూనే ఉన్నారు. ఆళ్వారుల భార్యకు నెలలు నిండుతున్నాయి. ఆమి బరువులు మోయలేకున్నది. అపుడు వారికి ఒక ఆలోచన వచ్చింది. వారిరువురూ కలిసి స్వామి గుడికి దగ్గరగ ఒక కోనేరును త్రవ్వి అందలి నీటితో అభిషేకము చేయాలని, ఆళ్వారులు మట్టిని త్రవ్వనారంచారు. భార్య మట్టిని మోసి దూరంగా పోయ నారంభిచింది. వారిరువురూ తప్ప వేరెవరూ సహాయ పడినా వారికి పుణ్యము తగ్గునేమోనని భయము. కాన ఎవ్వరి సహాయమును పొందకనే ఈ కార్యమును పూర్తి చేయాలని వారి నిర్ణయం.
          మట్టిని మోసి దూరంగా తీసు కొనిపోవు భార్య రోజులో కొంతభాగం వరకు చురుకుగ మోసి తరువాత అలసిపోయేది. ఒకనాడు ఆమె కష్టం చూడలేక ఒక గోపబాలుడు వచ్చి- “ఆమ్మా! నీవు మోయలేకున్నాను. కాన నేను ఆ మట్టి తట్టను తీసుకొని దూరంగా పోయి పోసివత్తును” అని అడిగాడు.