Home
Maagurimchi
Saahithyamu
Samskrithi
Devaalayaalu
Kalalu
Baala Saahithyamu
Charitra
Vaarthalu
Photo Gallery
 

బౌద్ధమతం


వేదవిహితమైన కార్యకలాపాలు చాలా ఎక్కువగా జరుగుతున్న సమయంలో యజ్ఞయాగాదులలో పశ్వాలంభనం జరుగుతోందనే ఏకైక కారణంతో బుద్ధుడు క్షాత్రధర్మాన్ని పూర్తిగా విడిచి పెట్టి అహింసా పరమోధర్మః అనే నినాదాన్ని తీసుకొని బౌద్ధమతాన్ని స్థాపించాడు. ఇది వైదిక మతానికి వ్యతిరేకంగా తలెత్తిన మతం. ఐతే ఆనాడు అశోకుడు మొదలైన రాజులు యుద్ధాలు చేసి చేసి విసిగిపోయిన తరుణం. దాంతో ఇది బాగుందని తలచి బౌద్దమతాన్ని వ్యాప్తిచేయడానికి పూనుకొన్నారు. ఇలా ఆరంభించబడిన ఈ మతం ఆంథ్రలో కూడా బాగానే వ్యాప్తి చెందింది. ఆథ్రదేశంలో బౌద్ధమతం ఎప్పుడు ప్రవేశించింది అనేదాన్ని ఖచ్చితంగా చెప్పలేంగాని స్వదేశీ సాహిత్యాధారాలతో అది బుద్ధుని కాలంలోనే ఆంధ్రదేసం లో ప్రవేశించిందని చెప్పవచ్చును. అస్సక అనే జనపదాన్ని ఆధ్ర కరట్ట అనే ఒక గ్రామం బౌద్దసాహిత్యంలో కనిపిస్తుంది. స్తుతనిపాతం అనే గ్రంధం లోని 1019పద్యం బావరి అనే ఆచార్యునిచేత వ్రాయబడినదిగా చెప్పబడుతూ ఈ గ్రామాన్ని ఉట్టంకించాడని తెలుస్తోంది. ఇతడు 16 మందిని శిష్యులను బుద్ధుని దగ్గరకు వెళ్ళి తన ఆర్హతత్త్వాన్ని తెలుసుకొని రమ్మన్నాడని తెలుస్తోంది. ఆ శిష్యులు రాజగృహంలోని బుద్ధుని కలిసి ఆయన బోధ విన్నారు. వెంటనే అర్హతులయ్యారు వారిలో పింగయ అనే వాడు అనాగామి గానే మిగిలిపోయాడు. అతడు ఆ ధమ్మబోధను వావరికి వినిపించగా అతడు వెంటనే అర్హతుడయ్యాడు దీనిని గమనించిన ఎంతో మంది ఆంధ్ర దేశం నుంచి బుద్ధుని దర్శించి అర్హతులయ్యారు. దక్షిణాపథానికి చెందిన ఒకడు శోభావతీ నగరరాజు సమక్షంలో బుద్ధనాటకాన్ని ప్రదర్శించాడు ఇతడు ఆంధ్రుడేనని ఊహ అని అంటారు. బుద్ధుని శిష్యులలో ఒకరైన మహాకాత్యాయనుడు ఒక అస్సక రాజుకు బౌద్ధ ప్రవజ్య ఇచ్చినట్లు విమానవత్థు వ్యాఖ్యానంలో పేర్కొంటున్నది. అసలు బుద్దుడే స్వయంగా ఆంధ్రదేశంలో ధమ్మబోధ చేశాడని యువాన్ చాంగ్ పేర్కొంటున్నాడు. శ్రావస్తి వద్ద ఒక అంధకవనం రాజగృహవద్ద మరొక అంధకవింద ఆరామాలు న్నట్లు మహావగ్గ చెపుతున్నది. ఇవి ఆంధ్ర దేశంనుంచి బౌద్ధ ధమ్మం కోసం వెళ్ళిన వారు ఉండడానికి ఏర్పాటు చేసిన విశ్రాంతి మందిరాలో ఆరామాలో కావచ్చును. అశోకునికి 13వ శాసనం ఆంధ్రులు రాజ విషయంలో ఉంటున్నారని చెబుతుంది. వారు బౌద్ధధమ్మాన్ని పాటిస్తున్నారని ఇటీవల ధాన్యకటకంలో లభించిన అశోకస్తంబశకలం చెబుతుంది. అమరావతి స్తూపం అశోకనిర్మితం అన్నారు. కాని అది వాస్తవంకాదు. దానికి అశోకుడు గ్రానేట్ కంచె వేయించి పెంచి అందంగా తీర్చిదిద్దాడు.దాని శిల్ప లక్షణాలను బట్టి అది అశోకుని కాలానికి ముందే ఉందని తెలుస్తోంది. మరీ చెప్పాలంటే అమరావతి శిల్ప కళ సాంచి బుద్ధగయల శిల్పకళా దశకు ముందరిదే అని ఘోషం సర్కారులు చెప్పారు. బుద్ధునికాలంలో బద్ధం అంతగా ఆంధ్రదేశంలో వ్యాప్తిలోకి రాకపోయినా అది తరువాతి కాలంలోనూ అశోకుని కాలంలోనూ బాగా వ్యాప్తి చెందింది బుద్ధుని చితాభస్మం నుంచి ఖేమాధేరుడనే భిక్షువు బుద్ధుని ఎడమ కోరపంటిని తీసి కళింగ దేశాధిపతికివ్వగా అతడు దానికి రత్నకరండంచేయించి తన రాజధాని దంతపురంలో పెట్టి పూజించాడు. చివరికది సింహళం చేరింది. స్థానికంగా ఎల్లలు దాటని బౌద్ధాన్ని అశోకుడే అంతర్జాతీయం చేశాడు. నాడు ఆంధ్ర అశోకుని ఏలుబడిలో ఉండడం వలన సామంతులు అంతా అశోకుని ధమ్మఘోషను బలపరచారు. కళింగ రాజ్యం ఆరోజులలో గోదావరి అంచులలో వ్యాపించింది. అశోకుడు సాగించిన ఒకే ఒక యుద్ధం కళింగ యుద్ధం. అదిచండ అశోకుని ధమ్మ అశోకుపనిగా పరివర్తనం చేసింది. బుద్ధుని అనంతరం నూరేళ్ళకు వైశాలి లో జరిగిన సగీతిలో దశవస్తువులపే పొడసీూపిన విభేదాలుతో బౌద్ధ సంఖం ధేరులు మహా సాంఘికులు అనే రెండు వర్గాలుగా చీలిపోయింది. మౌర్యుల తరువాత మగఝనేసిన శృంగవంశీయులవు కాణ్వులు బౌధ్ధులను హింసించడంతో ధేరులు సింహళానికి మహా సాంఘికులు ఆంధ్ర దేశానికి వలస పోయారు. ఆవిధంగా మౌర్య సామ్రాజ్య పతనానంతరం ఆంధ్ర దేశం బౌధ్ధానికి కేంద్రమైపోయింది. మహావంశం ప్రకరం అశోకుడు బుద్ధుని అవశేషాల మీద 84000 స్థూపాలను నిర్మించాడు. వీటిల్లో కనీస రెండు, వీటిలోఒకటి అమరావతి, రెండోది భట్టిప్రోలు స్థూపాలి కచ్చితంగా బుద్ధుని ధాతు అవశేషాలమీద నిర్మితాలు అయ్యాయి. భట్టిప్రోలు లో దొరికిన శాసనం ఈ విషయాన్ని నిరూపిస్తోంది. ఆంధ్రలో ధేరవాదం మహాసాంఘికం రెండూ కూడా వాటి శాఖలతో సహా బాగా నాటుకుపోయాయి. మూడో శతాతాబ్దం నుంచి ఇక్కడ మహాయాన మహాసాంఘిక సంప్రదాయాలతో పాటు ధేరవాదం కూడా ప్రబలి ఉంది. బుద్ధ శాసనాన్ని బట్టి ధేరవాదులు శ్రీపర్వతాన్ని కేంద్రంగా చేసుకొని తమ కార్యకలాపాలను తీవ్రతరంగా కొనసాగించి నట్టు తెలుస్తోంది. వీరి లక్ష్యం మహాయానానికి అడ్డు కట్ట వేసి తమ సంప్రదాయంలోని శుద్ధతమ సారళ్యతమత్త్వాన్ని కాపుడు కోవడం మనకు కనిపిస్తుంది. బౌద్ధమత వ్యాపకులలో ముఖ్యులు బుద్ధఘోషుడు ధేరవాదులు చేస్తున్న అటువంటి కృషి బుద్ధఘోషునికి మంచి నేపథ్యంగా పనిచేసింది. ఇతడు మంచి ధేరవాదవ్యాఖ్యాత. ఇతడు క్రీ శ 4 వ శతాహబ్దానికి చెందిన వాడు. తాను మొరణ్ణఖేట కు చెందినవాడుఅని తాను రచించిన విశుద్ధి మగ్గలో చెప్పుకొన్నాడు. మెరణ్ణ ఖేటకును పల్నాడు లోని నెమలిపురి గుడ్లూర్ కోటగా గుర్తించారు. ఏది ఏమైనా ఇతడు శ్రీ పర్వతీయుడు. ధేర్వాద పాండిత్యంతో ప్రభావితమై శ్రీలంక వేళ్ళి అక్కడ బౌద్ధాధ్యయనంచేసి ఇక్కడ మన దేశంలో విస్తృతమైన మూల పాళీగ్రంథాలను వ్యాఖ్యానాలను వెనకకు తీసుకొని వచ్చాడు. అతడి ముఖ్య గ్రంథం విశుద్ధి మగ్గ. దీనిని రచిస్తూ తన చివరి సంవత్సరాలను శ్రీపర్వత సింహాల విహరం వెళ్ళ బుచ్చాడు. ఆచార్య నాగార్జునుడు మహాయానంలో ఆచార్య నాగార్జునుడు మహామేరువు ఇతడు ఆంధ్రుడు. ఇతని గురించిన ప్రితి విషయం అతని కాలం తల్లి దండ్రులు జన్మస్థలం అతడు ఒకడా ఇద్దరా అనే ప్రశ్న అన్నీ వివాదాస్పదాలే. నాగార్జునుడు బ్రాహ్మణుడు. విదర్భలో పుట్టాడని యువాన్ త్సాంగ్ ఉట్టంకించాడు. కాని లంకావతార సూత్రం అతడు దక్షిణాపథం వేదలిలో పుట్టాడని అంటుంది . జివి కృష్ణారావుగారు విగ్రహ వ్యావర్తని పరిచయంలో పేర్కొన్నది కూడా ఇదే . వేదల ఆంధ్ర గ్రామం. అంధ్రలో కుంటుంబనామం ఇంటిపేరు గ్రామనామంగా ఉండడం మనం గమనిస్తాం వేదుల ఇంటిపేరు గల బ్రాహ్మణులు అనేకమంది ఇప్పటికీ ఉన్నారు. శ్రాపర్వదతానికి తూర్పున శ్రీస్థానానికి పడమర గల మధ్య ప్రదేశంలో పుట్టాడని ఎల్ ఎమ్ జోషి LIFE AND TIME OF MEDHYS MAKA PHILOSPHER NAGAJUNA అనే గ్రంథంలో రాశారు. శ్రీ స్థానం అంటే ధాన్యకటకం . ఇతడు శాతవాహనులకాలంలో జీవించాడు. కవి వత్సల హాలునికి ఏక బ్రాహ్మణ గౌతమీ పుత్రునికి గౌతమీ పుత్ర యజ్ఞశ్రీకి సమకాలీనుడు అని చెపుతారు. యువాన్ త్సాంగ్ ను ప్రమాణంగా తీసుకొంటే ఇతడు యజ్ఞశ్రీకి సమకాలీనుడు. ఇతడు మహాయాన మూలగ్రంథాలైన అవతంసక ప్రజ్ఞా పారమితి సద్దర్మపుండరీక లను నాగలోకంనుంచి తెచ్చాడంటారు కృష్ణానదీ ముఖద్వారాన్ని నాగలోకం అంటారు. కృష్ణలోయలోని శైల సంప్రదాయం ప్రాజ్ఞాపారమిత వికాసానికి దోహదం చేయడం చాలామంది చారిత్రకులకు తెలిసినదే. ఇతడు ఇరవై పైచిలుకు గ్రంథాలను రాశాడు. ప్రజ్ఞాపారమిత శాస్త్రటీక మాధ్యమిక కారికా దశ భామి విభాషా శాస్త్రం సుహృల్లేఖ లు ఇతని రచనలలో ముఖ్యమేనవి చివరిదైన సుహృల్లేఖ అనే మిత్రునికి వ్రాసిన లేఖ క్రీ శ 700 సంవత్సరం లో గూడా విద్యార్థులు కంఠస్తం చేసి వప్పచెప్పేవారని చైనా యాత్రికుడు ఇత్సింగ్ వర్ణించాడు. ప్రపంచంలోనేకనీ వినీ ఎరుగని న్యాయ తార్కిక విసంవాదకుడు నాగార్జునుడు. ఇప్పడు ప్రాచుర్యంలో ఉన్న బౌద్ధాన్ని వాస్తవ పరిశీలనా దృష్టితో పరిశీలించి తన కాలానుగుణంగా స్థిరీకరించి వ్యవస్థాకరించి దానికి నూతన మత సంప్రదాయాచరణలను ఊపిరిగా చేశాడు ఇతర మతాలదాడిని తన న్యాయ పటిమతో పారద్రోలి బౌద్ధాన్ని కొంతకాలంపాటు కొనసాగేలా చేయగలిగాడు. ఇతడు బౌద్ధ సంరక్షకుడుగా బౌద్ధమతానికి నూతనంగా ఊపిరి పోసినవాడిగా చరిత్రలో స్థిరస్థానాన్ని పొందాడంటే అతిశయోక్తి కానేకాదు. ఆర్యదేవుడు ఇతడు దక్షణాపథాన నివసించిన పండితుడు. ఆంధ్రుడు కావడానికే ఎక్కువ అవకాశాలున్నాయని చారిత్రకుల అభిప్రాయం. ఇతనిని దేవుడు అని కణదేవ అని నీలనేత్రుడనీ పిలుస్తారు. నాగార్జునుని శిష్యుడు ఇతడు . నాగార్జునుని తరువాత అతని స్థానాన్ని పూరించగలిగిన వాడు పొందగలిగినవాడు కూడా. మాధ్యమిక అగ్రగామి చింతనులలో ఈతడు ఒకడు. చతుశ్శతక శతశాస్త్ర అక్షర శతకాలు ఇతడు రచనలు.ఇతడు దేశమంతా తిరిగి ధేరాదులతోనూ ఇతర మతాలవారితోనూ సంవాదాలు చేసి వారిని జయించినమేధావి. ఇతనితో వాదం లో ఓటమి పాలైన ఒక బ్రాహ్మణ యువకుడు ఇతనిని హత్య చేశాడు అని ఈతని అంత్య గాధ బుద్ధపాలిత ఆర్య దేవుని అనంతరం 150 సంవత్సరాలపాటు ఆధ్ర దేశంలో మహాయానం స్తబ్దం అయిపోయింది. అపుడు 5 వశతాబ్దిలో మాధ్యమిక వాది బుద్ధ పాలితుడు రంగాంమీదికి వచ్చాడు. ఇతడు దంతపురంలో జన్మించాడు. దంతపురం బహుశా కళింగ పట్టణం కావచ్చును. ఇతడు రాసిన మాధ్యమిక వృతి్త నాగార్జునునిమాధ్యమిక శాస్త్రం మీద వ్యాఖ్యానం ఇతడు న్యాయ శాస్త్రంలో నూతన విధానాన్ని ప్రవేశపెట్టాడు. వాదంలో ప్రత్యర్థిని ఒక అసంబద్ధం ఎటూకాని పరిస్థితి కి నెట్టి అతనిని ఓడించడం ఆవిధానం ఈ విధంగా శూన్యవాదం లో ప్రాసంగికసంప్రదాయాన్ని నెలకొలిపింది. ఈ విధానానికి ఆద్యుడు బుద్ధపాలితుడే భావవివేకుడు ఇతడు మలయగిరివాసి అని యువాన్త్సాంగ్ అన్నాడు. మలయగిరి మంగళగిరి కావచ్చును. అని ఆచార్య భట్టిప్రోలు హనుమంతరావుగారు అభిప్రాయపడుతున్నారు. ఇతడు క్రీశ 6 వశతాబ్దికి చెందినవాడు. బుద్ధ పాలితప్రాసంగిక సంప్రదాయాన్ని ఇతడు ఏవగించుకొన్నాడు. మాధ్యమిక వాద వ్యతిరేకులవను మాధ్యమిక వాదం తోనే ఎదుర్కోవాలి కాని తర్కాలకు పాల్పడరాదని ఇతడి నిశ్చితాభిప్రాయం. ఇతడు ఎక్కువకాలం ధాన్యకటకంలోనే గడిపాడు. మహాయాన కరతల శాస్త్రం ,మాధ్యమిక హృదయ తర్కజ్వాల ప్రజ్ఞానపరదీప ఇంకా ఇకతర గ్రంథాలు ఈతన గంటంనుండి వెలువడినవే. దిఙ్నాగుడు ఇతడు వసుబంధు శిష్యుడు. స్వతంత్ర చింతనుడు విజ్ఞాన వాద రచయితలలో చాల గొప్పవాడు. భారతీయతర్కానికి పితామహుడు.ఇతడు దక్షిణ దేశమంతా ముఖ్యంగా ఒరి్స్సా మహారాష్ట్ర ఆంధ్రదేశాలు పర్యటించి యోగాచార సంప్రదాయాన్ని ప్రచారం చేశాడు. యువాన్త్సాంగ్ ప్రకారం ఇతడు వేంగికి వాయువ్యంగా నివసించినవాడు. మహాతార్కికుడు గనుక ప్రమాణ సముచ్చయమనే న్యాయ శాస్త్ర గ్రంథాన్ని రాశాడు. ఇది ఆతని ముఖ్యగ్రంథం మరో ముఖ్య గ్రంథం ప్రజ్ఞా పాదమిత సంగ్రహం ఇందులో అతడు అద్వయ భావనను ప్రవేశ పెట్టాడు. ధర్మ కీర్తి ఆంధ్ర బౌద్ధ దార్శనికులలో చివరి వాడు ఇతడే. తిరుమల నివాసి క్రీ శ 7వ శతాబ్ది ఉత్తరార్థానికి చెందినవాడు ప్రమాణ వార్తిక న్యాయ బిందు గ్రంథాలను వ్రాశాడు . ఇతడు మహామీమాంసకుడైన కుమారిలబట్టుని మేనల్లుడు. ధర్మకీర్తి కుమారిలుని ఓడించి బౌద్ధంలోకి అతనిని ఆతని శిష్యులతో సహా మార్పిడి చేసిన మహా బుద్ధిశాలి. బుద్ధుని గతిశీల తాత్వికతకు ధర్మకీర్తి శిఖరాయమానుడయ్యాడు. ఆంధ్రలో బౌద్ధం బావుటా ఆంధ్రలో బౌద్ధం ఒక ఉద్యమంగా భాసిల్లింది. రాజుల ప్రపకం లేకనే స్వతంత్రంగా ఆంథ్రలో బౌద్ధం పరిఢవిల్లింది. ఆంధ్ర దేశం లోని బౌధ్ధ స్మారక చిహ్నాలన్నీ కూడా పవితరులన కొంతమంది దాతృత్వంతో రాజాంతఃపురాల స్త్రీలదానాలతో నిర్మితాలయ్యాయి. అశోకుని తరువాతఆంధ్ర దేశాన్నేలిన ఏరాజు ఒక్క పులోమావి ఏవో కొన్నిరాజకీయ కారణాలవలన తప్పహబౌద్ధాన్నిఆదతరించలేదు. ేక బ్రాహ్మణ బిరుదాన్ని స్వీకరించిన గౌతమీ పుత్ర శాతకర్ణి గాని యజ్ఞశ్రీ పేరును సార్థకం చేసుకోవడానకి బహుళంగా యజ్ఞాలు నిర్వహించిన యజ్ఞశ్రీ కాని బౌద్దాన్ని బలపరచలేదు. వైదిక బ్రాహ్మణ మతాన్ని వారు అవలబించారు.ప్రోత్సహించారు. వర్ణవ్యవస్థనువారి మతానుసారంగా ప్రోత్సహించారు. బుద్ధి బలశాలురుగా బ్రాహ్మణాధిక్యతను వారు అంగీకరించారు. ఆర్య నాగార్జునుడు యజ్ఞశ్రీని కొంతవారకు మర్చాడు . శాతవాహనులలో చివరివాడైన విజయమరి కొంత మారాడు. తరువాత వచ్చిన ఇక్ష్వాకులలో చాంతి మూలుడుప మళ్ళీ చరిత్రను వెనకకు తిప్పాడు బ్రాహ్మణ మతానికి మొగ్గు చూపాడు. క్రీ శ 5 వశతాబ్దినుంచి విష్ణుకుండినులు బౌద్ధాన్ని ప్రోత్సహించారు. బౌద్ధాన్ని పోషించిన వారిలో ఎక్కువ మంది స్త్రీలు. వారి భర్తలు బ్రాహ్మణమతపక్షపాతులైనా చాలా మంది అంతఃపుర స్త్రీలు రాణులు రాకుమార్తెలు బౌద్ధాన్ని అభిమానించారు. కొంతమంది శాతవాహన రాణులు ఎక్కువమంది ఇక్ష్వాకురాచ స్త్రీలూ ఉదారంగా బౌద్ధానికి దానధర్మాలు చేశారు. ఉదాహరణకు గౌతమీ బాలశ్రీ తన పుత్రుని మనుమని బాగా ప్రభావితులను చేసింది . వీరు ముగ్గురూ బొద్ధానికి చేసిన దోహదం నాసికం శాసనం వలన తెలుస్తోంది. ఇక్ష్వాకుకుల స్త్రీలు ఒకరికి ఒకరు పోటీ పడి బొద్ధానికి దానాలు చేశారు. ముఖ్యంగా పేర్కొనదగిన వనిత చాంతి మూలుని సోదరి శాంతిశ్రీ. ఈమె శ్రీ పర్వతం వద్ద ఉన్న మహాచైత్యానికి మరమత్తులు చేయించి దానిని పెంచి పునర్నిర్మించింది. ఉపాసిక బోధిశ్రీ (ఈమె ఇక్ష్వాకు వంశానికి చెందినదోగాదో సందేహమని చారిత్రకులే అంటారు) చులధమ్మగిరి విహారంలో చైత్యాన్ని నిర్మించింది. తరువాత పేర్కొనదగిన మహిళ విష్ణుకుండినుల వంశానికి చెందిన గోవిందరాజ వర్మ భార్య పరమ మహాదేవి లేదా పరమ భట్టారిక మాహాదేవి. రాచస్త్రీలేకాకవృత్తికారులు వణిజులు బౌద్ధాన్ని ఆదరించారు. అసలు వాణిజ్యవర్గాలవారే ఎక్కువగా బౌద్ధం స్వీకరించారు మరి జన సామాన్యానికి బౌద్ధం అర్థం అయిందా అంటే వారికి బౌద్ధ సూక్ష్మాలు తలియక పోవచ్చునుగాని సరళమైన అష్టాంగ మార్గాన్ని అర్థం చేసుకున్నారని చెప్పపచ్చును.





























back to top
సాధువు కోపం - చాకలికి తాపం