Home
Maagurimchi
Saahithyamu
Samskrithi
Devaalayaalu
Kalalu
Baala Saahithyamu
Charitra
Vaarthalu
Photo Gallery
 

ఆడియోస్ అండ్ వీడియోస్

అమృతవాక్కుల.కామ్ లో తెలుగు సాహిత్యం, తెలుగు సంస్కృతిని ప్రతిబింబించే ఎన్నో విషయాలు చర్చిస్తున్నాం. ఈ సైట్లోని విషయాలను, వివిధ ఖండాలలో ఆసియా, అఫ్రికా, అమెరికా, యునైటడ్ కింగ్ డమ్స్, జపానులలోని, భారతదేశం, అమెరికాలోని వివిధదేశాలు, దుబాయ్, జపాన్, ఇంగ్లాండుదేశాలలోనూ విరివిగా చూస్తున్నారు. అభిమానులు ఆదరిస్తున్నారు.
ఇది పూర్తిగా ఉచితంగా చూడతగిన వెబ్ సైట్గా రూపొందిచడం వలననూ ఎవరైనా ఏ విషయాన్నైనా ఎక్కడినుండయినా ప్రతిలిపిని (కాపీ) చేసుకోవడానకి దాచుకోవడానికి (సేవ్) తగిన రీతిలో రూపొదించడం వలననూ లోకప్రియం అయ్యింది. ఈ ప్రక్రియలో భాగంగా ఫొటోగాలరీ అనే నిశ్చల చిత్రాలు (ఫొటోలు) ఉంచడం జరిగింది. ఇంకా విభాగాలుగా తెలుగు దేశం లోని ఎన్నో విశేష చిత్రాలను ఇందులో పొందు పరుపవలసి ఉంది.
ఇదే రీతిలో సాహిత్యం సంస్కృతికి సంబంధించిన ముద్రిత శబ్దాలు, ముద్రిత చలనచిత్రాలు ఉంచడానికి ప్రయత్నిస్తున్నాం. క్రొత్తగా వచ్చిన ఈ వెబ్ సైటు ఆరంభింపబడి కొద్ది రోజులు అయినా యావత్ ప్రపంచంలోనూ ఎదరో అసక్తికల విద్యార్థులు , ఉద్యోగస్తులు, కళాశాల అధ్యాపకులు, విశ్వవిద్యాలయాలలోని విద్యార్థులు ఆచార్యులు కూడా చూస్తూ స్పందనను మెయిల్ ద్వారా తెలుపుతున్నందుకు చాలా ఆనందిస్తున్నాం.మీ మెయిల్ను amrutakala@yahoo.com అనే చిరునామాకు పంపగలరు. ఈ వెబ్ సైట్ లో విజ్ఞానం సంస్కృతి సాహిత్యాలకు సంబంధించిన వ్యాసాలు కోర బడుతున్నాయి..అన్నీ పరిశోధనాత్మకంగా ఉండాలి. ప్రధాన పుటను చూని అందులోని విషయాలమీద వ్యాసాలు వ్రాయాలి. శబ్దాంకితమైన సీ డీలను కూడా ఆహ్వానిస్తున్నాం.
చంద్రశ్రీ ఆడియోస్ మరియు వీడియోస్ పేర విడుదల అయిన సీడీలు ఈ విభాగాలలో ప్రస్తుతం డాక్టర్ అమృతవాక్కుల శేషకుమార్ నెల్లూరు ( ఆ వెబ్ సైటు సంస్థాపకులు) ప్రసంగించిన అనేక ఆడియో సీడీలను ఉంచ వలసి ఉన్నది. వీటిలో మొదటిగా మహా భారతంలోని యుద్ధఘట్టంలో భగవానుడైన శ్రీ కృష్ణుడు నరుడైన అర్జునునకు ఉపదేశించిన భగవద్గీతను వచన రూపంలో (శ్లోకాలు లేకుండా ) అందించడనికి సిద్ధం చేస్తున్నాం. దీని వలన భారత దేశంలోని తెలుగు వారు చాలామంది స్పందించి భగవద్గీతా సారాన్ని తేలికగా అర్థం చేసుకొని మంచి స్పందనను తెలి పి ఉన్నారు. ఈ రచన గ్రంథ రూపంలో కూడా విడుదల చేయబడింది.
ఇదే రీతిలో ఆంధ్రదేశానికి మకుటాయమానమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారితో సహా తమ్ముడుగా చెప్పబడే ద్వారకాతిరుమల వేంకటేశ్వరస్వామి వారి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరు, తాడేపల్లిగూడెం నగరాలకు నడుమ పశ్చిమంగా ప్రసిద్ధ పుణ్య క్షేత్రం అయిన ద్వారకాతిరుమల గ్రామంలో వెలసి ఉవ్నారు. వారి సుప్రభాతవ్యాఖ్యానాన్ని శ్లోకాలతో సహా అమృతవ్యాఖ్యతో అందించే ఆడియోనికూడా మీకు అందిస్తాం. ఈ సుప్రభాతంలో దశావతారాలు స్వామి వారి వైభవాలు, ద్వారకాతిరుమల క్షేత్ర మాహాత్మ్యం మొదలైన విషయాలు కూలంకషంగా చర్చించబడ్డాయి. ఈ వ్యాఖ్యానం గ్రంథంగా కూడా వెలువరించ బడింది.
డా. అమృతవాక్కుల శేషకుమార్ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలలో స్వామి వారిగ్రామోత్సవాలలో పాల్గొన్నస్వర్ణరథం, గరుడవాహనం, గజవాహనం, ముత్యాలపల్లకివాహనం, అశ్వవాహనం, రథోత్సవం మొదలైన ఊరేగింపుల వివరాలు సప్తగిరి తిరుపతి వారి విడుదల చేసిన ప్రత్యేక కార్యక్రమాలలో యవనికాంతర భాషణ (స్క్రిప్టు), గాత్రం (వాయిస్) ఇచ్చారు. ఇంకా తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిస్వామి వారి రథసప్తమి పర్వదినోత్సవాలలో భాగంగా ఒకే రోజున ఏడు వాహనాల ఊరేగింపులకు కూడా వీరు ఇప్పటికే రెండు సంవత్సరాలు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఆ సీడీలుకూడా ఉన్నాయి.
అదే విధంగా శ్రీనివాసమంగాపురం గ్రామంలోని కళ్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలలోని గ్రామోత్సవాల విశేషాలుకూడా వ్రాసి చదవడం జరిగింది. ఇంకా ఈ పద్ధతిలోనే అలర్మేల్మంగాపురం గ్రామంలోని అలర్మేల్మంగమ్మ క్షేత్రమాహాత్మ్యంతో కూడిన అమ్మవారి బ్రహ్మోత్సవాల ఊరేగింపులకు కూడా వ్యాఖ్యానాలు ఆడియో సీడీలుగా వెలువరించారు. తిరుపతి నగరంలోని గోవింద రాజ స్వామి బ్రహ్మోత్సవాలు కోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవాలలోని ఊరేగిపులను గురించి కూడా విశేషంగా వ్యాఖ్యానించారు. పై గ్రామోత్సవవైభవాలను శ్రీవేంకటేశ్వరవిలాసం పేర సిడీలుగా విడుదల చేశారు.
వీటితోపాటు నెల్లూరు నగరంలోని అపర శ్రీరంగంగా చెప్పబడే శ్రీరంగనాథస్వామివారి క్షేత్రమాహాత్మ్యం దేవాలయ శిల్ప శోభలు స్వామి వారి దేవాలయ ప్రాంగణ వివరాలతో ప్రత్యేకంగా సి డీలు వచ్చాయి. నెల్లూరు జిల్లాలోని కంచి కామకోటి పీఠాధిపతులు నడిచేదేవుడు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారి కరకమలాలతో ప్రతిష్టించబడిన ఆది శంకరుల దేవాలయం కల పురాణ ప్రసిద్ధమైన శ్రీకామాక్షీతాయీ సమేత శ్రీ మల్లి కార్జున స్వామి వారి దేవాలయ బ్రహ్మోత్సవాలలో భాగంగా తిరుకళ్యాణమహోత్సవాలను వర్ణిస్తూ దేవాలయ శోభతో పాటు శిల్పసంపద దేవాలయ నిర్మాణం ప్రక్కనే ప్రవహిస్తున్న పినాకినీ ( పెన్నా ) నదీ పవిత్రత జన్నవాడలోని స్నానఘట్టాల భోగట్టా లను తెలుపుతూ కూడా సీడీలు విడుదల అయ్యాయి.
నెల్లూరు జిల్లా కావలి పట్టణం లోని సుందరేశ్వరాలయంఅష్టలక్ష్మీ దేవాలయాల ప్రతిష్ఠాకార్యక్రమంకూడా సిడీలుగా వచ్చాయి. ఇవన్నీ ఆడియో సీడీలు.
ఇంకా ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి సుప్రభాతాన్ని వీడియో సీడీగా నిర్మించి విడుదల చేశారు. ఇందులో శ్రీ స్వామివారి దేవాలయచిత్రాలు, స్వామి వారి చిత్రాలు, స్వామి వారి బ్రహ్మోత్సవాలలోని కళ్యాణోత్సవాల చిత్రాలు పొందుపరుపబడ్డాయి. సుప్రభాత గీతాన్ని డా. అమృతవాక్కుల శేషకుమార్ గారే గానం చేశారు. ఈ సీడీ కూడా విడుదల అయ్యింది.
శ్రీ అమృతవాక్కులవారు తమ అమృతవాక్కుల.కామ్ వెబ్ సైట్ ను ప్రారంభిస్తూ తే 15-12-2007 న నెల్లూరు నగరంలో మహా రుద్రయాగం చడీహోమాలు చేయించారు. (వార్తలు విభాగంలో విపులంగా చూడగలరు.) ఈ సందర్బంగా అగ్ని మథనం ప్రాచీన కాలంలో యజ్ఞయాగాదులకు అగ్నిని పుట్టించడానికి ఉపయోగించే సాధనాలతో రగిలింపచేశారు. ఈ వీడియోనుకూడా వెబె సైట్ లో పొందుపరుస్తారు. పూర్వం ఆది మానవుడు పచ్చి మాంసాన్ని పచ్చి దుంపలను ధాన్యం, కాయలను గింజలను తినేవాడు . తరువాతి కాలంరాతి యుగంలో ఒక రాయిని మరొకకరాయితో కొట్టగా పుట్టిన నిప్పుతో కాల్చుకొని తింటూ ఉండేవాడు. చలిబాధనుండి రక్షించుకోవడానికి ఈ పద్ధతిలోనో అగ్నిని పుట్టించేవాడు. తరువాత నాగరికతను పొంది చెట్టుకొమ్మలతో రాపిడి చేసి నిప్పును ఆవిష్కరించాడు. ఈ పద్ధతియజ్ఞయాగాదులలో ఉపయోగించే అగ్నికి వాడేవారు.
ఇదే పద్ధతిలో వ్యాస భగవానులవారు అరణి సాధన( నిప్పును పుట్టించే సాధనాలు) తో అగ్నిని పుట్టించడానికి ఉపక్రమించినప్పుడు అతనికి శుకమహర్షి పుట్టినాడు అని పురాణగాధ ఉంది. అలాంటి ప్రక్రియ ఇప్పటికీ అవలంబిస్తున్నారు.. అది ఎలా జరుగుతుదో చూపించే వీడియోను ఈ వెబ్ సైట్ లో పొందు పరుస్తున్నాం. ఇలాంటి అనేక విశేషాలను ఆడియో వీడియో విభాగంలో ప్రపంచానికి వినిపించాలని చూపించాలని ఈ విభాగాన్ని పొందు పరచడం జరిగింది.
ఆ యా విశేషాలను చూద్దాం.

సమర్పణ- శ్రీ అగ్రో ఫార్మ్స్ ఎల్లసిరి నాయుడుపేట. నెల్లూరు జిల్లా. ఆంధ్రప్రదేశ్

*వినండి వివిధ విషయాలతో ఉన్న ఆడియోలు*



“లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగరాజధామేశ్వరీం” పాడినవారు- చంద్రకళ అమృతవాక్కుల - Audio

“ద్వారకాతిరుమల వేంకటేశ్వర సుప్రభాతం” పాడినవారు డా.. అమృతవాక్కుల శేషకుమార్ - Audio

శ్రీసూక్తం వేదభాగం- లక్ష్మీదేవినిగురించిన ప్రార్థన - Audio

శ్రీరంగనాయకస్వామి దేవాలయం నెల్లూరు . స్క్రిప్టు మరియు గాత్రం డా. అమృతవాక్కుల శేషకుమార్ - Audio

శ్రీమద్వచనభగవద్గీత- రచన మరియు గాత్రం- “భారత్ గురు” డా||అమృతవాక్కులశేషకుమార్ - Audio

Eesopanishad - Audio


Dwarakatirumala Suprabhatam - Video


Fire with Arani - Video